AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అంతా ఓకే.. రెడీ.. ప్రారంభోత్సవంలోనే కుప్పకూలిన ఫుట్ బ్రిడ్జి.. షాకింగ్ వీడియో

ఫుట్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

Viral Video: అంతా ఓకే.. రెడీ.. ప్రారంభోత్సవంలోనే కుప్పకూలిన ఫుట్ బ్రిడ్జి.. షాకింగ్ వీడియో
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jun 08, 2022 | 1:58 PM

Share

Mexican footbridge collapse: అందమైన నగరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలాంటి ప్రాంతంలో ప్రజలకు మరింత ఆనందాన్ని చేకూర్చేలా అధికారులు ఫుట్ బ్రిడ్జిని కొత్తగా నిర్మించారు. ఓ వాగుపై వంతెనను అద్భుతంగా రూపొందించారు. ఈ క్రమంలో అంతా ఓకే అయింది.. ఫుట్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫుట్ బ్రిడ్జిపై అందరూ నడుస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నగర మండలి సభ్యులతో సహా స్థానిక అధికారులు బండరాళ్లపై వాగులో పడిపోయారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ షాకింగ్ ఘటన మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. ప్రారంభోత్సవ వేడుకలోనే ఫుట్‌బ్రిడ్జ్ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే మెక్సికన్ నగరంలోని క్యూర్నావాకా ప్రాంతంలో స్థానిక మేయర్ ఫుట్ బ్రిడ్జ్ ప్రారంభిస్తుండగా మంగళవారం ఈ సంఘటన జరిగిందని.. దాదాపు 20 మంది కింద పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో ఫుట్ బ్రిడ్జ్ పై అందరూ నడుస్తుండగా.. అది ఒక్కసారి కుప్పకూలింది. దానిపై అమర్చిన చెక్కలతోపాటు నడుస్తున్న వారు చెల్లాచెదురుగా కిందపడిపోయారు. చెక్క పలకలు, మెటల్ గొలుసులతో ఈ గొలుసు వంతెనను ఇటీవల పునర్నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై మేయర్ జోస్ లూయిస్ ఉరియోస్టెగుయ్ మాట్లాడుతూ ప్రారంభ సమయంలో.. తనతో పాటు వచ్చిన కొంతమంది వంతెనపై దూకుతున్నారని.. అందుకే అది ఒక్కసారిగా కూలినట్లు తెలిపారు.

వైరల్ వీడియో..

ఈ ఘటనలో మేయర్‌తోపాటు ఇద్దరు అధికారులు, నలుగురు సిటీ కౌన్సిల్ సభ్యులు, ఒక స్థానిక రిపోర్టర్ గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..