AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: త‌మిళంలో ఫుడ్ ఆర్డర్ చేసిన అమెరిక‌న్ .. మనసు దోచేశావంటున్న నెటిజన్లు.. వీడియో..

ఓ అమెరికన్‌ యూట్యూబర్‌ కూడా భారతదేశమన్నా, భారతీయులన్నా ఎంతో ఇష్టం. మరీముఖ్యంగా తమిళ్‌ భాష అంటే మరీ ఇష్టం. ఇతను ఆ ఇష్టాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.

Viral Video: త‌మిళంలో ఫుడ్ ఆర్డర్ చేసిన అమెరిక‌న్ .. మనసు దోచేశావంటున్న నెటిజన్లు.. వీడియో..
Food Order In Tamil
Shaik Madar Saheb
|

Updated on: Jun 08, 2022 | 1:41 PM

Share

Food order in Tamil: భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు ఎన్నో భాషలు, పద్ధతులు మాట్లాడే ప్రజలు మన దేశంలో నివసిస్తుంటారు. ఒక్కో ప్రాంతానిది ఒక్కో ప్రత్యేకత. మన దేశ సంస్కృతిని ఇతర దేశాల వారు కూడా ఎంతో ఇష్టపడతారు. అంతేకాదు వాటిని కొందరు అనుసరిస్తారు.. అనుకరిస్తారు కూడా. అలాగే ఓ అమెరికన్‌ యూట్యూబర్‌ కూడా భారతదేశమన్నా, భారతీయులన్నా ఎంతో ఇష్టం. మరీముఖ్యంగా తమిళ్‌ భాష అంటే మరీ ఇష్టం. ఇతను ఆ ఇష్టాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అమెరికాకు చెందిన క్జియోమానిక్ అనే యూ ట్యూబర్‌ అరీహ్ స్మిత్‌కు త‌మిళ భాష అంటే ఇష్టం. ప్రపంచంలోనే త‌మిళం పురాతన భాష అని తెలుసుకుని దానిపై ఆసక్తి పెంచుకున్నాడు.. పట్టుబట్టి తమిళం మాట్లాడడం నేర్చుకున్నాడు.

న్యూయార్క్ న‌గ‌రంలో త‌మిళిలకు చెందిన షాపుల‌ను వెదుక్కుంటూ వెళ్లి, అక్కడ త‌మిళంలో ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటాడు. అత‌డు త‌మిళంలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చే వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతూ ఉంటాయి. అత‌డు త‌మిళంలో మాట్లాడ‌టం చూసి, ఓ దుకాణ య‌జ‌మాని ఎంతగానో మురిసిపోయాడు. స్మిత్ వ‌ద్ద డ‌బ్బులు కూడా తీసుకోలేదు. ఈ వీడియో చూసిన భార‌తీయ నెటిజ‌న్లు కూడా స్మిత్‌ను ప్రశంసించారు.

వైరల్ వీడియో..

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోను YouTube Xiaomanycలో షేర్ చేయగా.. రెండు మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీంతోపాటు స్మిత్ ను అందరూ ఫిదా అవుతున్నారు. తమిళం బాగా మాట్లాతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..