Viral: దేర్ దేర్.. సీ సీ.. బ్యాక్ సైడ్.! వడపావ్ తినదామనుకున్నారు.. సీన్ కట్ చేస్తే

డబ్బు, బంగారం, మరేదైనా.. మన దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. దొంగల పాలవ్వకతప్పదు. ఆ వైరల్ వీడియోపై మీరూ లుక్కేయండి.

Viral: దేర్ దేర్.. సీ సీ.. బ్యాక్ సైడ్.! వడపావ్ తినదామనుకున్నారు.. సీన్ కట్ చేస్తే
Viral Video
Follow us

|

Updated on: Sep 04, 2024 | 3:13 PM

డబ్బు, బంగారం, మరేదైనా.. మన దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. దొంగల పాలవ్వకతప్పదు. దీనికి నిదర్శనంగా ఇటీవల పూణేలో ఓ సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ దొంగ అత్యంత సులభంగా రూ. 5 లక్షల విలువైన బంగారు నగల బ్యాగ్‌ను కొట్టేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు కాగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. పూణేకు చెందిన వృద్ధ దంపతులు బ్యాంక్‌లోని తమ బంగారు నగలను విడిపించుకుని స్కూటీ మీద ఇంటికి తిరిగి వస్తున్నారు. మార్గం మధ్యలో ఓ షాప్‌ దగ్గర వడపావ్ కొనేందుకు భర్త ఆగగా.. భార్య స్కూటీ దగ్గర నిలబడి ఉంది. ఇక ఇదంతటిని గమనిస్తున్న ఓ దొంగ.. సరైన సమయంలో ఆ నగల బ్యాగ్ పట్టుకుని ఉడాయించాడు. గమనించిన వృద్ధురాలు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఈలోపే ఆ దొంగ వెళ్లిపోయాడు. కాగా, ఈ ఘటన ఆ షాప్‌ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. లేట్ ఎందుకు దీనిపై ఓ లుక్కేయండి.