వార్నీ.. వీడి ప్రేమ తగలెయ్య.. ప్రియురాలికి ఏం ఇచ్చాడో చూడండి..

ప్రేమలో పడితే చాలు. ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటారు అబ్బాయిలు. ఆ  ప్రేమ కాస్త.. పెళ్లి వరకు వెళ్లడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో ప్రియురాలి మనసును పూర్తిగా దోచేసుకునేందుకు ఆమెకు ఇష్టమైన వాటిని తెచ్చి ఇవ్వడం.. కొరిన వాటిని కొనివ్వడం కామనే. అయితే ఈ సందర్భంలో ఇచ్చే వాటిని ప్రియురాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండేట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. కొందరు ఆర్నమెంట్స్ ఇస్తే.. మరి కొందరు ఇష్టమైన డ్రెస్సులు కొనిస్తుంటారు. ఇక మరికొందరైతే […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:50 am, Mon, 28 October 19
వార్నీ.. వీడి ప్రేమ తగలెయ్య.. ప్రియురాలికి ఏం ఇచ్చాడో చూడండి..

ప్రేమలో పడితే చాలు. ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటారు అబ్బాయిలు. ఆ  ప్రేమ కాస్త.. పెళ్లి వరకు వెళ్లడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో ప్రియురాలి మనసును పూర్తిగా దోచేసుకునేందుకు ఆమెకు ఇష్టమైన వాటిని తెచ్చి ఇవ్వడం.. కొరిన వాటిని కొనివ్వడం కామనే. అయితే ఈ సందర్భంలో ఇచ్చే వాటిని ప్రియురాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండేట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. కొందరు ఆర్నమెంట్స్ ఇస్తే.. మరి కొందరు ఇష్టమైన డ్రెస్సులు కొనిస్తుంటారు. ఇక మరికొందరైతే ప్రియురాలికి నచ్చేలా రింగ్‌లు ఇస్తూ సప్రైజ్ ఇస్తూ ఉంటారు. అయితే జపాన్‌కు చెందిన ఓ యువకుడు.. తన ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికి తానే ఓ రింగ్ తయారు చేసి ఇచ్చాడు. అయితే అందులో ఏముంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అసలు ఏలా తయారు చేశాడో తెలిస్తే.. కడుపుబ్బా నవ్వుకుంటూ..ఇవేం ఐడియాలురా నాయానా అని అనుకుంటారు.

వివరాల్లోకి వెళితే.. జపాన్ దేశానికి చెందిన ఓ ప్రియుడు.. తన ప్రియురాలిపై ఉన్న ప్రేమను వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. ఆమె కోసం ఓ ఉంగరాన్ని తయారు చేశాడు. అయితే అది అలాంటి ఇలాంటి రింగ్ కాదు.. దానికంటూ ఓ స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే అది మామూలుది కాదు. అతడి చేతి గోళ్లతో అతడే స్వహస్తాలతో తయారు చేసిన ఉంగరం. ఇందుకోసం అతడు ఏడాది పాటు కష్టపడ్డాడు.

తన పెరిగిన గోళ్లను కట్ చేస్తూ.. ఓ చోట కూడబెట్టాడు. ఆ తర్వాత ఆ గోళ్లను అన్నీ మిక్సీలో వేసి పొడి చేశాడు. అనంతరం ఆ పొడిని నీళ్లలో మిక్స్ చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ఓవెన్‌లో పెట్టి వేడిచేశాడు. ఆ తరువాత దాన్ని చిన్న పప్పు దినుసు సైజ్ వచ్చేలా చేశాడు. ఆ తర్వాత అప్పటికే రెడీ చేసిపెట్టుకున్న సిల్వర్ రింగ్‌లో ఆ పప్పు దినుసులా తయారు చేసిన గోళ్ల మిశ్రమాన్ని ఓ వజ్రంలా అమర్చాడు. అయితే ఈ తతంగాన్ని ఎలా చేశాడో మొత్తం.. వీడియో తీసి షేర్ చేశాడు. దీంతో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. గోళ్లతో రింగ్ ఏంటో అంటూ.. పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందంటూ రకరకాల కామెంట్లతో సోషల్ మీడియా సెటైర్లు కురిపిస్తోంది ఈ వీడియోపై.