రూ.13 కోట్ల వజ్రం.. అచ్చం ‘ధూమ్ 2’ లో మాదిరిగా కొట్టేశారు

జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని యోకోహామాలో అంతర్జాతీయ నగల ఎగ్జిబిషన్ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి 410 నగల సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇందులో భాగంగా  ఓ గాజు పేటికలో ఉంచిన 50 క్యారెట్ల వజ్రం కళ్లు మిరుమిట్లు గొలుపుతూ కాంతులు విరజిమ్ముతోంది. ఆ ప్రదర్శన మొత్తానికి అదే హైలెట్‌గా నిలిచింది. దాని ఖరీదు రూ.13 కోట్లు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రదర్శను చూసేందుకు వచ్చిన వారికి కనువిందు చేసిన ఆ వజ్రం […]

రూ.13 కోట్ల వజ్రం.. అచ్చం 'ధూమ్ 2' లో మాదిరిగా కొట్టేశారు
Follow us

|

Updated on: Oct 27, 2019 | 12:31 PM

జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని యోకోహామాలో అంతర్జాతీయ నగల ఎగ్జిబిషన్ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి 410 నగల సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇందులో భాగంగా  ఓ గాజు పేటికలో ఉంచిన 50 క్యారెట్ల వజ్రం కళ్లు మిరుమిట్లు గొలుపుతూ కాంతులు విరజిమ్ముతోంది. ఆ ప్రదర్శన మొత్తానికి అదే హైలెట్‌గా నిలిచింది. దాని ఖరీదు రూ.13 కోట్లు.

అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రదర్శను చూసేందుకు వచ్చిన వారికి కనువిందు చేసిన ఆ వజ్రం కన్పించకుండా పోయింది. దీంతో ప్రదర్శనశాలలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. అప్పటి వరకు కనిపించిన డైమండ్ మాయం కావడం మిస్టరీగా మారింది. వాటిని వేయి కళ్ళతో కాపలా కాస్తుంటారు. పదుల సంఖ్యలో సిసిటీవీలు నిత్యం అక్కడి విషయాలను పర్యవేక్షిస్తుంటుంది.  ప్రపంచం నలుమూలల నుంచి ప్రసిద్ధి చెందిన ఆభరణాల సంస్థలు తమ ఆభరణాలను ప్రదర్శనకు ఉంచుతున్నారు అంటేనే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు.  అత్యంత భద్రత ఉన్నా.. డైమండ్ ఎలా మాయమైందో ఎవరికీ అంతుబట్టకుండా పోయింది. వెంటనే అలర్టైన నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా ఫక్కీలో మాయమైన డైమండ్ ను కొట్టేసిన వారి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.