Viral Video: నువ్వు నిజంగా రియల్ హీరోవే బాస్.. పిల్లిని కాపాడిన వ్యక్తిని ప్రశంసిస్తున్న నెటిజన్లు.. వీడియో
Cat Rescue Viral Video: ఆపదలో ఎవరున్నా.. సాయం చేయాలని పెద్దలు పదేపదే చెబుతుంటారు. మంచి పనులు చేస్తే.. ఆ మంచి మన వెంటే ఉంటుందన్న సామెతలను కూడా వింటుంటాం.. అలా మంచి పనులు

Cat Rescue Viral Video: ఆపదలో ఎవరున్నా.. సాయం చేయాలని పెద్దలు పదేపదే చెబుతుంటారు. మంచి పనులు చేస్తే.. ఆ మంచి మన వెంటే ఉంటుందన్న సామెతలను కూడా వింటుంటాం.. అలా మంచి పనులు చేసి ప్రపంచంలోని చాలామంది హృదయాలను గెలుచుకున్న వారు నూటికి ఒక్కరో ఇద్దరో ఉంటారు. అలాంటి వారికి సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు చూసినప్పుడల్లా.. మానవత్వం ఇంకా బతికుంది అంటూ నెటిజన్లు ఆనందపడుతుంటారు. నిజంగా అలాంటి వీడియోలు.. చాలామందికి ప్రేరణగా, ఆదర్శంగా నిలుస్తుంటాయి. తాజాగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మనం చూడవచ్చు.. రైలు పట్టాల మీద ఉన్న ఓ పిల్లిని.. వ్యక్తి కాపాడి చాలామంది హృదయాలను గెలుచుకున్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ నుంచి ఒక పిల్లిని రక్షించడం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఈ పిల్లి రైలు ట్రాక్ మీద వెళ్లింది. రైలు ప్రయాణిస్తున్న క్రమంలో పిల్లి ట్రాక్ మధ్యలో దిమ్మెల మధ్య నక్కి ఉంది. అయితే.. ఈ పిల్లిని ఓ వ్యక్తి చూసి.. సిబ్బందికి సమాచారమిచ్చాడు. దీంతో ఒక ఉద్యోగి రైల్వే ట్రాక్ మీద దిగి దానిని కాపాడాడు. ఈ మొత్తం ఘటనను అక్కడున్న మరో వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా చూడండి.. వీడియో..
View this post on Instagram
ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా.. పిల్లిని కాపాడిన వ్యక్తిని నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. సాయం చేసే వ్యక్తులే నిజమైన హీరోలు.. వారికి మనుషులు మాత్రమే కాదు జంతువుల జీవితాలు కూడా ముఖ్యమేనంటూ పేర్కొంటున్నారు. కాపాడటం నిజంగా గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీ goodnews_movement షేర్ చేసింది. దీనిని చాలామంది లైక్ చేస్తూ.. తన కామెంట్లను తెలుపుతున్నారు. కాగా ఈ ఘటన న్యూయార్క్ సిటీలో గత వారం జరిగింది.
Also Read: