Viral Video: ప్రిన్సిపాల్ పోస్టు కోసం సూపర్ ఫైట్.. విద్యాశాఖ కార్యాలయంలోనే ఇరగ్గొట్టుకున్నారు.. వీడియో వైరల్
Principal's post violent: ప్రిన్సిపాల్ పోస్టు కోసం ఇద్దరు వ్యక్తులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఈ పోస్టు కోసం గొడవ తారాస్థాయికి చేరడంతో.. ఓ టీచర్‌తో పాటు మరో మహిళా టీచర్ భర్త ఇద్దరూ కొట్టుకున్నారు. ఇదంతా ఎక్కడో కాదు..
Principal’s post violent: ప్రిన్సిపాల్ పోస్టు కోసం ఇద్దరు వ్యక్తులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఈ పోస్టు కోసం గొడవ తారాస్థాయికి చేరడంతో.. ఓ టీచర్‌తో పాటు మరో మహిళా టీచర్ భర్త ఇద్దరూ కొట్టుకున్నారు. ఇదంతా ఎక్కడో కాదు.. స్వయానా రాష్ట్ర విద్యా శాఖ కార్యాలయంలో జరిగింది. ఈ షాకింగ్ సంఘటన బీహార్‌లోని మోతీహరిలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లంతా ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటే.. ఉద్యోగాలున్న వీరు ఇలానా ప్రవర్తించేది అంటూ.. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. బీహార్‌లోని చంపారన్ జిల్లాలోని అదాపూర్ ప్రైమరీ పాఠశాలలో శివశంకర్ గిరి, రింకీ కుమారి అనే ఇద్దరు టీచర్లు పని చేస్తున్నారు. అయితే ప్రిన్సిపల్ పోస్టు కోసం వీరిద్దరి మధ్య మూడు నెలల నుంచి వాగ్వాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం గిరి, రింకీ కలిసి మోతిహరిలోని స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కార్యాలయానికి వచ్చారు. వీరిద్దరి సమస్య విన్న విద్యాశాఖ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ ఇద్దరు టీచర్ల ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లను మూడు రోజుల్లోగా సమర్పించాలంటూ ఆదేశించారు.
అయితే.. ఎవరు మొదట డాక్యుమెంట్స్ సమర్పిస్తారు అనే విషయంలో శివశంకర్ గిరికి, రింకీ కుమారి భర్తకు మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి కార్యాలయంలోనే ఒకరికొకరు దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఇద్దరు కిందపడి మరి కొట్టుకున్నారు. సిబ్బంది వారిద్దరిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వారు ఒకరినొకరు చేయిజేసుకున్నారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత అధికారులు దీనిపై స్పందించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపట్టామని.. అనంతరం చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
వీడియో..
प्रिन्सिपल की कुर्सी पर कौन बैठेगा इस विवाद में @NitishKumar के राज्य में पूर्वी चंपारण ज़िला के आदापुर में देखिए दो शिक्षक के बीच कैसे मारपीट हो रही हैं @ndtvindia @Anurag_Dwary @sanjayjavin pic.twitter.com/ahCsO0VOqk
— manish (@manishndtv) October 14, 2021
Also Read: