Viral Video: అడవిలో ఎలుగుబంటికి పులి తారసపడితే ఎట్లుంటదో తెలుసా? ఇక్కడ ఏం జరిగిందో మీరు ఊహించలేరు..

Viral Video: పెంపుడు జంతువులు, అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Viral Video: అడవిలో ఎలుగుబంటికి పులి తారసపడితే ఎట్లుంటదో తెలుసా? ఇక్కడ ఏం జరిగిందో మీరు ఊహించలేరు..
Viral Video
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 15, 2021 | 11:07 AM

Viral Video: పెంపుడు జంతువులు, అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వైరల్ వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అడవిలో పులి నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఇంతలో దాని వెనుకవైపు నుంచి ఎలుగుబంటి సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. రెండూ దగ్గరగా వెళ్తాయి.. ఇక బలమైన ఆ రెండు అటవి జంతువులు హోరాహోరీగా తలపడుతాయని ఎవరైనా ఊహించుకుంటారు. అయితే అక్కడ ఏం జరిగిందో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పులిని చూసి ఎలుగుబంటి రెండుకాళ్లపై లేచి నిలబడుతుంది. ఆ భారీ ఎలుగుబంటిని ఢీకొనే బలం తనకు లేదన్నట్లు పులి.. దాని ఎదుట మోకరిల్లుతుంది. బాక్సింగ్ రింగ్‌లో ఫోజు ఇచ్చినట్లుగా.. ఎలుగుబంటి రెండుసార్లు అలా రెండు కాళ్లపై లేచి నిలబడుతుంది. ఇంతలో ఆ ప్రాంతంలో జనసంచారాన్ని చూసిన ఎలుగుబంటి భయంతో గుబురు పొదళ్లలోకి పరుగులు తీస్తుంది. అయితే పులి మాత్రం.. మనుషులంటే తనకు లెక్కలేదన్నట్లు అక్కడే కూర్చుని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సందీప్ త్రిపాఠి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడ రికార్డు చేశారన్న వివరాలు వెల్లడించలేదు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. పులి, ఎలుగుబంటి ఎదో చర్చలు జరుపుతున్నట్లు ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మరో నెటిజన్.. ప్రకృతి సహజ సూత్రం ఉల్లంఘన జరిగిందంటూ కామెంట్ చేశాడు. పులిని చూసి ఏ మాత్రం భయపడని ఎలుగుబంటి.. మనుషులను చూసి పారిపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నాడు. పరస్పరం  తలపడే శక్తిసామర్థ్యాలూ రెంటికీ ఉన్నా.. పరస్పర గౌరవంతో కలిసి జీవించడం అవి అలవాటు చేసుకున్నట్లు ఉందని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

Also Read..

Viral Video: వినాయకుడే పుట్టాడంటూ..! ఊరిజనం పూజలు.. వీడియో

Viral Video: ఈ చిలుక చూడండి.. అప్పడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! వీడియో

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..