Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భాగ్యనగరంలో 17 రోజులపాటు వర్షం కురిస్తే.. ఏమవుతుందో తెలుసా..? షాకిస్తున్న బిట్స్ పిలానీ అధ్యయనం

BITS-Pilani study on Hyderabad:హైదరాబాద్‌లో గత కొంతకాలం నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షం కురిస్తే.. చాలు నగరంలోని చాలా ప్రాంతంలకు వరదలు

Hyderabad: భాగ్యనగరంలో 17 రోజులపాటు వర్షం కురిస్తే.. ఏమవుతుందో తెలుసా..? షాకిస్తున్న బిట్స్ పిలానీ అధ్యయనం
Hyderabad Rains
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 15, 2021 | 12:41 PM

BITS-Pilani study on Hyderabad:హైదరాబాద్‌లో గత కొంతకాలం నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షం కురిస్తే.. చాలు నగరంలోని చాలా ప్రాంతంలకు వరదలు పోటెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. రోజుల కొద్ది కొన్ని ప్రాంతాలు జలమయంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అయితే.. రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిస్తేనే భాగ్యనగరంలో వరదలు పోటెత్తి భారీ నష్టం వాటిల్లుతోంది. పదిరోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. సమస్య వర్ణానాతీతంగా మారుతుంది. బిట్స్-పిలానీ నిర్వహించిన అధ్యయనంలో ఇలాంటి షాకింగ్ విషయాలే వెల్లడయ్యాయి. ఏకధాటిగా 17 రోజుల పాటు 440.35 మిల్లీమీటర్ల వర్షపాతం సంభవిస్తే.. హైదరాబాద్ సగభాగం మునిగిపోతుందని బిట్స్ పిలానీకి చెందిన సివిల్ ఇంజనీర్లు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారినప్పుడు.. జిహెచ్‌ఎంసి పరిమితుల్లోని దాదాపు 334 చదరపు కిలోమీటర్ల ప్రాంతం నీటిలో మునిగిపోతుందని బిట్స్ పిలానీకి చెందిన సివిల్ ఇంజనీర్ల కొత్త అధ్యయనం వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిమితి సుమారుగా 625 చదరపు కి.మీ. వరకు ఉంటుంది. అయితే.. ఈ భూభాగంలో దాదాపు సగభాగం నీటి కింద ఉంటుందని సివిల్ ఇంజనీర్ల బృందం తెలిపింది. “వాతావరణ మార్పు ఫ్రేమ్‌వర్క్‌లో HEC-RAS 2D ని ఉపయోగించి భవనాల అర్బన్ వరద ప్రమాద విశ్లేషణ” (Urban flood risk analysis of buildings using HEC-RAS 2D in climate change framework) అనే అధ్యయనంలో ఈ అంచనాను వెల్లడించారు. ఇది హైడ్రోలాజిక్ ఇంజినీరింగ్ సెంటర్ రివర్ అనాలిసిస్ సిస్టమ్ 2D మోడల్‌ను ఉపయోగించి అంచనా వేశారు. ఈ అధ్యయనం H2Open అనే జర్నల్‌లో ప్రచురితమైంది.

ఈ మోడల్ గురించి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రీసెర్చ్ స్కాలర్ అయిన ఆర్ మాధురి.. పలు విషయాలను ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిమితుల్లో వరద ప్రమాదం ప్రభావాన్ని రెండు సందర్భాలలో అంచనా వేసినట్లు వివరించారు. 6.0, 8.5 వర్షపాతంతో 17 రోజుల్లో 440.35 మిమీ వర్షం కురిసినా.. లేదా 19 రోజుల్లో 624.2 మిమీ వర్షం కురిసినా హైదరాబాద్ నగరంలోని సగభాగం ముంపునకు గురికావడం ఖాయమని తన పరిశోధనలో వెల్లడైందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో ఇలాంటి పరిస్థితే కనిపించినట్లు వెల్లడించారు. మోడల్ కంట్రోల్ నంబర్‌గా చివరి సారి పరిశీలిస్తే.. 215.9 మిమీ వర్షపాతంతో తొమ్మిది రోజులు వర్షాలు కురిశాయి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు అత్యంత భారీ వర్షపాతం సంభవించినట్లు గుర్తించారు. మూడు రోజుల్లో దాదాపు 90 మిమీ -100 మిమీ వరకు భారీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. దీంతో నగరంలో పరిస్థితులు ఎలా మారాయో అర్ధంచేసుకోవచ్చన్నారు.

చార్మినార్, ఎల్‌బీ నగర్.. మరికొన్ని ప్రాంతాలకు వరద ముప్పు.. నగరంలో పలు ప్రాంతాలకు వరద ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఎక్కువగా వరదలకు గురయ్యే ప్రాంతాల్లో 1, 2, 4 జోన్లు ఉన్నాయి. LB నగర్, చార్మినార్ జోన్, కూకట్‌పల్లి, అల్వాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. గత వర్షాల్లో కూడా ఈ ప్రాంతాల్లోనే వరదలు ఎక్కువగా సంభవించినట్లు అధ్యయనంలో వెల్లడించారు. వీటితోపాటు లోతట్టు ప్రాంతాలు కూడా వరద ప్రభావానికి గురవుతున్నాయి. నీటి కాల్వల ఆక్రమణల వల్ల ముంపు ప్రాంతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడించారు. నీటి నిల్వ ప్రాంతాల్లో భూ ఆక్రమణలు 1995 లో 55% ఉండగా.. 2016 నాటికి 73% కి చేరుకుందని.. 2050 నాటికి 85% కి పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడించారు. అన్ని ప్రాంతాల డేటాను.. భూ సామర్థ్యాన్ని అంచనా వేసి ఈ డేటాను సేకరించారు.

Also Read:

Viral Video: ప్రిన్సిపాల్ పోస్టు కోసం సూపర్ ఫైట్.. విద్యాశాఖ కార్యాలయంలోనే ఇరగ్గొట్టుకున్నారు.. వీడియో వైరల్

Viral Video: చర్చిలో బంగారం దోచుకెళ్లిన ప్రబుద్ధుడు.. సీన్ చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో
వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో
ఓట్స్‌ ఇలా తింటే బోలెడు పోషకాలు మీ సొంతం.. ! టేస్ట్‌లో బెస్ట్‌
ఓట్స్‌ ఇలా తింటే బోలెడు పోషకాలు మీ సొంతం.. ! టేస్ట్‌లో బెస్ట్‌
ఇంట్లో ఇలా చేసి చూడండి.. మీ పిల్లల చదువులో మంచి రిజల్ట్స్ వస్తాయి
ఇంట్లో ఇలా చేసి చూడండి.. మీ పిల్లల చదువులో మంచి రిజల్ట్స్ వస్తాయి
రాత్రిళ్లు అరటి పండ్లు తింటే నిజంగానే నిద్ర ముంచుకొస్తుందా?
రాత్రిళ్లు అరటి పండ్లు తింటే నిజంగానే నిద్ర ముంచుకొస్తుందా?
మహావృక్షాలకు ఊపిరిపోస్తున్న కడియం రైతులు వీడియో
మహావృక్షాలకు ఊపిరిపోస్తున్న కడియం రైతులు వీడియో
భార్య కాపురానికి రావట్లేదని టవరెక్కిన భర్త.. ఆ తర్వాత సీన్ ఇదే..
భార్య కాపురానికి రావట్లేదని టవరెక్కిన భర్త.. ఆ తర్వాత సీన్ ఇదే..
అర్ధరాత్రి గేటు మీద ఏదో వింత ఆకారం.. నేరుగా ఇంట్లోకి చొరబడింది..!
అర్ధరాత్రి గేటు మీద ఏదో వింత ఆకారం.. నేరుగా ఇంట్లోకి చొరబడింది..!
ఫ్రిడ్జ్‌లో గడ్డకట్టిన ఐస్‌ని వదిలేస్తే డేంజర్.. ఇలా తొలగించండి
ఫ్రిడ్జ్‌లో గడ్డకట్టిన ఐస్‌ని వదిలేస్తే డేంజర్.. ఇలా తొలగించండి
ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో
ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో