Viral Video: పుంజుకు తన పెట్టను చేరుకోవడం తెలీదా.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో
సోషల్ మీడియాలో డైలీ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో స్క్రాప్ ఎక్కువైనప్పటికీ.. అక్కడక్కడ కాస్త ఆకట్టుకునే వీడియోలు కూడా కంటపడుతున్నాయి.
సోషల్ మీడియాలో డైలీ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో స్క్రాప్ ఎక్కువైనప్పటికీ.. అక్కడక్కడ కాస్త ఆకట్టుకునే వీడియోలు కూడా కంటపడుతున్నాయి. అందుకే కాస్త క్రేజీ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. కోళ్లకు సంబంధించిన వీడియోలు.. మీరు చాలా చూసి ఉంటారు.. వాటి పెంపకం దగ్గర్నుంచి.. గుడ్లు పొదగడం.. పిల్లల్ని కాపాడుకునేందుకు కోళ్లు చేసే పోరాటాలకు సంబంధించిన వీడియోలు చాలా చూసి ఉంటారు.. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో నెక్ట్స్ లెవల్. తన సహచర కోడి పెట్ట కోసం.. ఓ పుంజు ఓ మినీ యుద్దమే చేసింది. అవాంతరాలు అధిగమించి.. కాస్త తెలివితేటలు ఉపయోగించి .. తన ప్రియతమ పెట్టను చేరుకుంది. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ముందుగా వీడియో చూడండి
Partners…..??
Jab koi baat bigad jaye?? Tum dena saath mera….?? pic.twitter.com/UG3yttBYGR
— Rupin Sharma IPS (@rupin1992) December 2, 2021
పుంజు, పెట్ట.. ఓ చోట ఊసులు చెప్పుకుంటున్నాయి. ఈ లోపులో ఓ వ్యక్తి వచ్చాడు. పెట్టను పుంజు నుంచి విడదీశాడు. దీంతో కోపం వచ్చిన పుంజు తన ముక్కుతో అతడిని చాలాసార్లు పొడిచింది. అయినా అతడు విడిచిపెట్టలేదు. తిన్నగా తీసుకెళ్లి పెట్టను గూట్లో పెట్టి డోర్ వేశాడు. పైన గడయ మాదిరిగా పుల్లను అడ్డుపెట్టాడు. దీంతో కాసేపు తన పెట్ట కోసం అల్లాడిపోయిన పుంజు.. ఆ పుల్లను నోటితో తొలగించి.. తన పెట్టను చేరుకుంది. ప్రజంట్ ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ఈ వీడియోను ట్టిట్టర్‌లో షేర్ చేశారు.
Also Read: ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర