Viral Video: ఈ వీడియో చూసిన తర్వాత మీరు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం.. ఓసారి చూసేయండి!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవలేదు. ప్రతీరోజూ వివిధ రకాల వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా...

Viral Video: ఈ వీడియో చూసిన తర్వాత మీరు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం.. ఓసారి చూసేయండి!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 06, 2021 | 9:57 AM

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవలేదు. ప్రతీరోజూ వివిధ రకాల వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన కంటెంట్ ఈరోజుల్లో ట్రెండ్ సృష్టిస్తోంది. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇదిలా ఉంటే.. సహాజంగా పాములంటే అందరికీ భయమే. దాన్ని దూరం నుంచి చూస్తే దడుసుకుంటాం. అలాంటిది మన పక్కనే ఉంటే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. ఇదే పరిస్థితి ఓ వ్యక్తికి ఎదురైంది. అతడు ఏం చేశాడో చూస్తే మీకు నవ్వు రావడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. అదొక షిప్ డెక్ అని మీకు అర్ధమవుతుంది. కొంతమంది వ్యక్తులు మెట్లు ఎక్కి పైకి వస్తున్నట్లుగా మీరు చూడవచ్చు. ఈ సమయంలో ఒక వ్యక్తి అటుగా జరజరా పాకుతున్న పామును చూసిన ఖంగారుపడిపోయి భయంతో వెనక్కి పరుగు తీశాడు. అదే సమయంలో పాము కూడా ఠక్కున తన దశను మార్చుకుంది. ఏదో ఇద్దరూ ‘టామ్ అండ్ జెర్రీ’ల మాదిరిగా ఒకరిని ఒకరు చూసుకున్న వెంటనే భయంతో దడుసుకున్నారు. ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అక్కడేం పాము లేదన్నట్లుగా అతడి ముందున్న వ్యక్తి మాత్రం హాయిగా నడుచుకుంటూ ముందుకొచ్చాడు.

కాగా, ఈ వీడియోను ‘Discovery.engenharia’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ అప్‌లోడ్ చేసింది. ఇప్పటివరకు దీనికి 50 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ వీడియో 1.5 మిలియన్లకు పైగా లైకులు సంపాదించింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా వీడియో చూసేయండి.