AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కుండ.. మూత తీసి చూడగా కళ్లు బైర్లు కమ్మే నిధి..! కాపాలాగా ప్రాణాంతకమైన..

అవన్నీ ఆ కుండలోని నిధిని రక్షిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇక వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలాగోలా వాటిని తీసి పక్కకు విసిరేశారు..అప్పుడు ఆ కుండ లోపల వారికి కళ్లు బైర్లు కమ్మే నిధి కనిపించింది. బంగారు హారం, పాత వస్త్రం ఒకటి కనిపించింది. దానిని బయటకు తీసివేయగా.. లోపల చాలా

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కుండ.. మూత తీసి చూడగా కళ్లు బైర్లు కమ్మే నిధి..! కాపాలాగా ప్రాణాంతకమైన..
Ancient Treasure
Jyothi Gadda
|

Updated on: Nov 03, 2024 | 8:32 PM

Share

మన దేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎల్లప్పుడూ ఏదో ఒకదానిపై పరిశోధనలు చేస్తూనే ఉంటారు. పురాతన కట్టడాలు, ఆలయాలకు సంబంధించిన రహస్యాలు, నిధి నిక్షేపాలకు సంబంధించిన ఆనవాళ్ల కోసం నిరంతర గాలింపు కొనసాగిస్తూ ఉంటారు. శాస్త్రవేత్తల పరిశోధనలో అనే సార్లు విలువైన వస్తువులు, ఎన్నో చరిత్ర ఆనవాళ్లను వెలికితీశారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పురావస్తు శాస్త్రవేత్తలకు ఊహించని నిధి దొరికింది. కానీ, ఆ నిధిని దక్కించుకోవాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సోసల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వైరల్ వీడియో షేర్‌ చేయబడింది. వీడియోలో ఒక వ్యక్తి పురాతన వస్తువును తవ్వితీస్తున్నాడు. ఓ వ్యక్తి గడ్డపారతో భూమిని తవ్వడంతో వీడియో ప్రారంభమవుతుంది. అతను తవ్వడం పూర్తి చేస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద పురాతన కుండ కనిపించింది. మట్టితో కప్పబడి ఉన్న ఆ కుండ నోటిపై తుప్పు పట్టిన మెటల్ ప్లేట్ ఏర్పాటు చేసి ఉంది. అది ఓపెన్‌ చేసి చూడా వారికి ఊహించని సీన్‌ ఎదురైంది.

ఇవి కూడా చదవండి

తవ్వకాల్లో బయటపడ్డ పాత కుండను వారు బయటకు తీసి ఓపెన్‌ చేసే ప్రయత్నం చేశారు..తుప్పు పట్టి ఉన్న ఆ కుండ మూతను తెరిచి చూడగానే లోపల కనిపించిన దృశ్యం వారి పోగొట్టేలా చేసింది. ఆ కుండలో పాములు, కప్పలు నిండివున్నాయి. అవన్నీ ఆ కుండలోని నిధిని రక్షిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇక వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలాగోలా వాటిని తీసి పక్కకు విసిరేశారు..అప్పుడు ఆ కుండ లోపల వారికి కళ్లు బైర్లు కమ్మే నిధి కనిపించింది. బంగారు హారం, పాత వస్త్రం ఒకటి కనిపించింది. దానిని బయటకు తీసివేయగా.. లోపల చాలా చిన్న చిన్నవి బంగారు నాణేలు కనిపించాయి. ఇక మొత్తం ఆ కుండను కిందకు దులిపేయగా..వందల నాణేలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

కాగా, ఈ వీడియో 600,000 లైకులు, 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇక ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ రెండు జీవులు అందులో ఎలా ఉన్నాయి. ఏం చేస్తు్న్నాయనే సందేహం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..