Watch: వెంటాడిన విషాదం.. ప్రయాణిస్తున్న కారుపై కూలిన భారీ వృక్షం.. ఒకరు మృతి..
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్న హుస్సేన్ తన సొంత కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఎంఆర్‌సి జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ గ్యారేజీ వద్ద మరమ్మతు పనులు ముగించుకుని తన కారును టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకెళ్లినప్పుడు సాయంత్రం 5.50 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కుమ్మరిస్తున్నాయి. కోయంబత్తూర్‌లోని నీలగిరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అనేక చెట్లు నెలకూలాయి. నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని వెల్లింగ్టన్ వద్ద మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ (ఎంఆర్‌సి) జంక్షన్ సమీపంలో కారుపై చెట్టు పడిపోవడంతో 44 ఏళ్ల వ్యక్తి శనివారం మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కూనూర్ సమీపంలోని వెల్లింగ్టన్‌కు చెందిన ఆర్ జహీర్ హుస్సేన్ గా తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్న హుస్సేన్ తన సొంత కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఎంఆర్‌సి జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ గ్యారేజీ వద్ద మరమ్మతు పనులు ముగించుకుని తన కారును టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకెళ్లినప్పుడు సాయంత్రం 5.50 గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇక్కడ క్లిక్ చేయండి..
ఎత్తైన యూకలిప్టస్ చెట్టు కారుపై పడటంతో కారు నుజ్జు నుజ్జైంది. అక్కడికక్కడే అతను మరణించాడని పోలీసులు తెలిపారు. దీంతో స్థానికులు వెంటనే వెల్లింగ్టన్ పోలీసులకు, కూనూర్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. కారులోంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కూనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..