Satellite Phone: ఎయిర్‌పోర్టులో శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడిన అమెరికా వ్యక్తి.. ఎక్కడంటే..

26/11 ముంబయి ఉగ్రదాడుల అనంతరం కేంద్ర హోంశాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీఏసీఎస్) దేశంలో శాటిలైట్ ఫోన్లను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై నిషేధం విధించాయి.

Satellite Phone: ఎయిర్‌పోర్టులో శాటిలైట్ ఫోన్‌తో పట్టుబడిన అమెరికా వ్యక్తి.. ఎక్కడంటే..
American Man Caught With Satellite Phone
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 03, 2024 | 6:22 PM

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు. శాటిలైట్‌ ఫోన్‌ కలిగి ఉన్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అమెరికాకు చెందిన డేవిడ్ అనే వ్యక్తి సింగపూర్ వెళుతుండగా అతడి వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు సీఐఎస్ఎఫ్ బలగాలు గుర్తించారు. దీంతో అతన్ని అధికారులు అదుపులోకి తీసుకుని శాటిలైట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, విచారణ కోసం ఆ వ్యక్తిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. విమానాశ్రయాలలో వాటిపై నిషేధం ఉందని అధికారులు తెలిపారు.

భారత్ లో శాటిలైట్ ఫోన్లు వ్యక్తిగతంగా వినియోగించడం నిషిద్ధమని, దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో వాటిపై నిషేధం ఉందని చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. 26/11 ముంబయి ఉగ్రదాడుల అనంతరం కేంద్ర హోంశాఖ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీఏసీఎస్) దేశంలో శాటిలైట్ ఫోన్లను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై నిషేధం విధించాయి. కేంద్ర ప్రభుత్వం, టెలికాం శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు ఉంటేనే భారత్ లో శాటిలైట్ ఫోన్లు ఉపయోగించడం సాధ్యపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..