Viral Video: మెట్రో రైలులో స్నానం.. ఇదేంటని అడిగిన ప్రయాణికులపై దాడి చేసిన వ్యక్తి.. వైరల్ వీడియో..
ఈ వీడియోపై చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు స్క్రిప్ట్ అని కూడా పేర్కొంటున్నారు. మరికొంత మంది మాత్రం ఇదేం పిచ్చిరా నాయనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని యూజర్లకు నచ్చడంతో తెగ షేర్ చేస్తుంటారు. అయితే, కొంతమంది మాత్రం ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ప్రయోగాలు చేస్తుంటారు. మరికొన్ని మాత్రం సహజంగానే రికార్డువుతుంటాయి. ఏదైమైనా వైరల్ వీడియోల హవా మాత్రం సోషల్ మీడియాలో అధికంగా ఉంటుంది. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైలులో ఓ వ్యక్తి స్నానం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి బాత్ టబ్‌లో స్నానం చేస్తూ కనిపించాడు.
అదే సమయంలో బాటిల్‌లోని నీళ్లను తనపైకి పోసుకుంటు, స్నానం చేస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఆ సమయంలో బాటిల్‌లోని నీరు సీట్‌లో కూర్చున్న అవతలి వ్యక్తిపై పడ్డాయి. అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తతకు చేరుకుంది. అయితే, కొంత మంది జోక్యం చేసుకోవడంతో, పరిస్థితి సద్దుమణిగింది. ఈ వీడియో న్యూయార్క్‌కు చెందినదని ప్రచారం జరుగుతోంది.
New York is not a real place ??? pic.twitter.com/sUjvFBh1If
— ENTERTAINMENT NETWORK (@dailyinstavids) August 25, 2022
ఈ వీడియోను @dailyinstavids అనే వినియోగదారు ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేశాడు. ఈ వీడియో ఆగస్టు 25న ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోకి ట్విట్టర్‌లో 36 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వీడియోలో వ్యక్తి పసుపు బాత్ టబ్‌లో స్నానం చేస్తున్నాడు. ఆ తర్వాత అతను ఉద్దేశపూర్వకంగా ఒక ప్రయాణికుడిపై పడే విధంగా తనపై నీరు పోసుకున్నాడు. అప్పుడు ప్రయాణికుడితో వాగ్వాదం జరిగింది.
ఇదంతా స్క్రిప్టేనా?
ఈ వీడియోపై చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు స్క్రిప్ట్ అని కూడా పేర్కొంటున్నారు. మరికొంత మంది మాత్రం ఇదేం పిచ్చిరా నాయనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు మెట్రోలో స్నానం చేయడం ఏంట్రా అంటూ తిడుతున్నారు.