AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బొమ్మతో సహజీవనం.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడు మరో సరికొత్త ట్విస్ట్.. మనోడి కథ వింటే ఫ్యూజులౌట్ అంతే..

సోలోగా ఉండటం ఎందుకులే అనుకుంటూ విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా బోమ్మలను ప్రేమిస్తూ.. వాటితో సహజీవనం చేస్తూ.. పిల్లల్ని కనే వరకు వెళ్తున్నారు..

Viral: బొమ్మతో సహజీవనం.. ఇద్దరు పిల్లలు.. ఇప్పుడు మరో సరికొత్త ట్విస్ట్.. మనోడి కథ వింటే ఫ్యూజులౌట్ అంతే..
Viral
Shaik Madar Saheb
|

Updated on: Aug 29, 2022 | 5:31 PM

Share

Man plans dream wedding with rag doll: పెళ్లి వద్దు.. కుటుంబం వద్దు.. సోలో లైఫే సో బెటర్ అనే వారు ఈ మధ్య కాలంలో ఎక్కడో ఒకచోట కనిపిస్తున్నారు. జీవితం మీద విరక్తో.. లేక పెళ్లి, బాధ్యతలు అంటే ఇష్టం లేకనో కొంతమంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.. అయితే.. ఇంకొంత మంది చిత్రవిచిత్రంగా ఉంటారు.. సోలోగా ఉండటం ఎందుకులే అనుకుంటూ విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా బోమ్మలను ప్రేమిస్తూ.. వాటితో సహజీవనం చేస్తూ.. పిల్లల్ని కనే వరకు వెళ్తున్నారు.. అరెరే.. దిమాక్ ఖరాబ్ అవుతోందా..? అవునండి.. ఈ కథలో ఓ వ్యక్తి బోమ్మను ఏడాది కాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జూన్‌లో ఓ మహిళ కూడా బొమ్మనే పెళ్లి చేసుకుని.. ఓ పిల్లను కన్నానంటూ ప్రకటించి అందరికీ షాకిచ్చింది.. ఇప్పుడు ఓ వ్యక్తి.. బొమ్మ మహిళతో పెళ్లికి సిద్ధమవుతున్నానని చెప్పడంతో.. నెటిజన్లు మీరంతా ఎక్కడ దొరికార్రా బాబూ అంటూ తలబాదుకుంటున్నారు.

ప్రస్తుతం ఓ టిక్‌టాకర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం టిక్‌టాక్‌లో @montbk5959 అనే యూజర్ తన సంబంధాన్ని పరిచయం చేశాడు. తాను ఒంటరిగా లేనని రాగ్ డాల్‌తో సంవత్సరం నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఇప్పుడు తాను తన లవర్ (బొమ్మ)తో కలల వివాహాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఆ రాగ్‌డాల్ పేరు నటాలియా అని.. ఒక సంవత్సరం నుంచి ఘాటైన ప్రేమలో ఉన్నానని.. రీసెంట్‌గా ఇద్దరం మొదటి సంవత్సరం వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లు తెలిపాడు. అతని వీడియోలలో.. అతను బొమ్మతో కలి వాకింగ్‌కు.. షాపింగ్‌కు కూడా వెళ్తుంటాడు. అంతేకాకుండా నటాలియాను తన కుటుంబానికి కూడా పరిచయం చేసినట్లు తెలిపాడు.. తాజాగా రాగ్‌డాల్‌తో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఫాలోవర్లకు చెప్పడంతో.. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Viral News

Viral News

ఇంకా.. తన జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పిన టిక్టాకర్.. వారితో కలిసి టీవీ చూస్తానని.. ప్రతిదాని గురించి మాట్లాడుకుంటామని తెలిపాడు. తాను.. ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నానో వారికి తెలియదు, ఆమెతో సంవత్సరమంతా గడిపాను. నేను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను అంటూ ఒక క్లిప్‌లో వివరించాడు. నటాలియా బొమ్మ కాదని.. తన హృదయం అంటూ తెలిపాడు. ఈ ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Wedding With Rag Doll

Wedding With Rag Doll

కాగా.. ఇలాంటి పెళ్లిళ్లు అంతకుముందు కూడా జరిగాయి.. కాదు. మెయిరివోన్ రోచా మోరేస్ అనే మహిళ కొన్నేళ్లుగా ఒంటరిగా ఉన్న తన రాగ్ డాల్ మార్సెలోను పెళ్లి చేసుకుంది. అతను నాతో పోరాడడు, వాదించడు, నన్ను అర్థం చేసుకున్నాడు. మార్సెలో గొప్ప నమ్మకమైన భర్త అని.. అలాంటి వ్యక్తి చూసి.. మహిళలంతా అసూయపడతారంటూ ఆమె అప్పట్లో చెప్పడం సంచలనంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..