Viral Video: ‘డేంజరస్’ స్ట్రీట్ డ్యాన్సర్..! మైకెల్ జాక్సెన్‌ని దింపేశాడుగా.. వీడియో మామూలుగా లేదు..
Viral Video: సోషల్ మీడియాలో డ్యాన్స్‌కి సంబంధించిన చాలా వీడియోలు దర్శనమిస్తాయి. అందులో ఇది ఒకటి. ఈ వీడియోలో ఒక వ్యక్తి మైకెల్ జాక్సన్ సాంగ్ డేంజరస్
Viral Video: సోషల్ మీడియాలో డ్యాన్స్‌కి సంబంధించిన చాలా వీడియోలు దర్శనమిస్తాయి. అందులో ఇది ఒకటి. ఈ వీడియోలో ఒక వ్యక్తి మైకెల్ జాక్సన్ సాంగ్ డేంజరస్ పాటకి రోడ్డుపై స్టెప్పులు వేస్తాడు. చుట్టు ఏం జరుగుతుందో పట్టించుకోకుండా తనలోకంలో నిమగ్నమైపోతాడు. అతడి చుట్టు పిల్లలు చేరి అతడి డ్యాన్స్‌ని వింతగా చూస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘వాటే డ్యాన్సర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోను కావేరి అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్ ఏం రాశాడంటే ‘మైకెల్ జాక్సన్ ఆత్మ అతడిలో నివసిస్తుందని రాశాడు’. అయితే మైకెల్ జాక్సన్ డేంజరస్ ఆల్బమ్ ఎంత పాపులారిటి సంపాదించిందో అందరికి తెలుసు. ఈ ఆల్బమ్ 1991లో విడుదలైంది. నెటిజన్లు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. మళ్లీ మళ్లీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి రోడ్డుపై డ్యాన్స్ ఎందుకు చేస్తున్నాడో తెలియదు. అతడి మానసిక స్థితి ఏ విధంగా ఉందో చెప్పలేదు. కానీ అతడి డ్యాన్స్ మాత్రం సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీడియోను లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.
వీడియోకి చాలా రెస్పాన్స్ వస్తోంది. ఒక యూజర్‌పై ఈ వ్యక్తి డ్యాన్స్ సమయంలో చాలా చురుకుగా, సరళంగా కనిపిస్తున్నాడని కామెంట్ చేశాడు. మరొక వినియోగదారు ఈ వ్యక్తి కొరియోగ్రాఫర్ కంటే తక్కువేమి కాదన్నాడు. కొంతమంది వ్యక్తులు బాలీవుడ్ కొరియోగ్రాఫర్లను ట్యాగ్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 80 వేలకు పైగా వీక్షించారు. అంతేకాదు లైక్‌లు, కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
The Ghost Of Michael Jackson lives within him. pic.twitter.com/l7DDGGyiXV
— Kaveri ?? (@ikaveri) September 29, 2021