సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి 108 రకాల వంటకాలను చేసి పెట్టడం సర్వసాధారణంగా గోదావరి జిల్లాలో జరిగే విషయమే.. అయితే ఇప్పుడు ఈ అలవాటు తెలంగాణ కు చేరుకున్నట్లు ఉంది.. తాజాగా సంగారెడ్డి పట్టణం శాంతి నగర్ చెందిన రాములు తన కుమార్తె డాక్టర్ నిష వివాహం ఇటీవల డాక్టర్ శ్రీకాంత్ అనే అతనితో జరిగింది. ఈ జంటకు ళ్లి అయిన తర్వాత తొలిసారి సంక్రాంతి పండగ వచ్చింది. ఈ పండగకు తన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచారు. తమ ఇంటికి వచ్చిన కొత్త అల్లునికి 108 రకాల వంటకాలను తయారు చేయించాడు రాములు. వీరితో పాటు రాములు సోదరుడి కుమారుడు కోడలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేసిన వంటకాలను రుచి చూసారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..