Viral Video: ఒక్కసారిగా కుంగిపోయిన ఇంట్లోని భూమి.. 20 అడుగుల లోతులోకి మహిళ..
మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ర్యాత్వారీ కొల్లరీలోని అమ్టే లేఅవుట్‌లో ఉన్న ఇంట్లో నేల ఒక్కసారిగా 20 అడుగుల లోతుకు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళ ఈ గుంతలో పడింది. మహిళతో పాటు ఆమె పెంపుడు కుక్క కూడా గోతిలో పడిపోయిందని స్థానికులు తెలిపారు.
మహారాష్ట్ర చంద్రపూర్‌లో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు రయిత్వారీ కాలనీలోని ఓ ఇంట్లో భూమి కుంగి.. 20 అడుగుల గుంతలో పడిపోయిందో మహిళ. ఆమె కేకలు విన్న స్థానికులు నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పరిస్థితులను చక్కదిద్దారు.
రయిత్వారీ కాలనీలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌కు చెందిన బొగ్గుగని ఉంటుంది. ఇక్కడి భూగర్భ గనిలోంచి బొగ్గును తీసిన తర్వాత అధికారులు ఆ ప్రాంతాన్ని వెంటనే ఇసుకతో పూడ్చాలి. అయితే గనుల్లోంచి బొగ్గు తీసిన తర్వాత ఇసుక నింపకపోవడం, వర్షాలు కురుస్తుండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఇక్కడి ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Aug 03, 2024 11:20 AM
వైరల్ వీడియోలు
Latest Videos