శభాష్ పిచ్చుక.. సాటి పక్షికి సీపీఆర్ చేసి.. ప్రాణం పోసి !!

శభాష్ పిచ్చుక.. సాటి పక్షికి సీపీఆర్ చేసి.. ప్రాణం పోసి !!

Phani CH

|

Updated on: Aug 05, 2024 | 9:16 PM

ప్రస్తుత కాలంలో అంతా సోషల్‌ మీడియా మయం అయిపోయింది. సాటి మనిషి ప్రమాదంలో ఉన్నా రక్షించడానికి బదులు వీడియోలు తీసి నెట్టింట పోస్ట్‌ చేయడానికే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. నూటికో కోటికో ఒకరు మానవత్వంతో స్పందించి సహాయం చేస్తారు. అయితే ఓ చిన్ని పక్షి తన సాటి పక్షిని కాపాడుకున్న తీరు మనుషులకు కనువిప్పు కలిగిస్తోంది. సాటిపక్షి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పిచ్చుకకు మరో చిన్ని పిచ్చుక సీపీఆర్‌ చేసి ప్రాణం పోసింది.

ప్రస్తుత కాలంలో అంతా సోషల్‌ మీడియా మయం అయిపోయింది. సాటి మనిషి ప్రమాదంలో ఉన్నా రక్షించడానికి బదులు వీడియోలు తీసి నెట్టింట పోస్ట్‌ చేయడానికే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. నూటికో కోటికో ఒకరు మానవత్వంతో స్పందించి సహాయం చేస్తారు. అయితే ఓ చిన్ని పక్షి తన సాటి పక్షిని కాపాడుకున్న తీరు మనుషులకు కనువిప్పు కలిగిస్తోంది. సాటిపక్షి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పిచ్చుకకు మరో చిన్ని పిచ్చుక సీపీఆర్‌ చేసి ప్రాణం పోసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఊర పిచ్చుక ఎగురుతూ వచ్చి హటాత్తుగా కింద పడిపోయింది. చలనం లేకుండా పడి ఉన్న ఆ పక్షిని అక్కడే ఉన్న మరో పిచ్చుక చూసి వెంటనే ఆ పక్షిదగ్గర వాలింది. తన ముక్కుతో ఆ పక్షిని పొడుస్తూ లేపడానికి ప్రయత్నించింది. అయినా ఆ పక్షి కదల్లేదు. ఈ చిన్ని పక్షి తట్టుకోలేపోయింది. పదే పదే ఆ పక్షిని తన ముక్కుతో సీపీఆర్‌ చేస్తున్నట్టుగా దాని పొట్టపైన పొడుస్తూ… మధ్య మధ్యలో దానికి శ్వాస అందిస్తూ.. మళ్లీ మళ్లీ దానిని పొడుస్తూ..కదిలిస్తూ విశ్వప్రయత్నం చేసింది. చివరకు ఆ చిన్నిప్రాణి ప్రయత్నం ఫలించింది. పక్షిలో చలనం వచ్చింది. శ్వాస ఆడటంతో తిరిగి ప్రాణం లేచొచ్చింది ఆ పక్షికి. అంతే హాయిగా అక్కడినుంచి ఎగిరి వెళ్లిపోయింది. అది చూసి ఈ చిన్ని పిచ్చుక కూడా సంతోషంగా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఎవరో దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సీపీఆర్‌ చేయాలనే ఆలోచన ఆ చిన్ని పక్షికి ఎలా వచ్చిందని కొందరు, ఈ పిచ్చుక గుండెకు సంబంధించిన పాఠాలు విని ఉంటుంది.. అందుకే ఈ ఆలోచన వచ్చింది అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కండోమ్‌తో జాగ్రత్త.. భవిష్యత్తులో ఆ సమస్యలు !! అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు

అమ్మ నగలు నావే.. మరదలికి ఇవ్వని ప్రిన్స్‌ విలియమ్‌

లద్దాఖ్‌ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా.. ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్న సైనికులు

పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా శునకం విధులు.. డ్యూటీ ఎలా ఉంటుందో తెలుసా ??

Sreeleela: ఆశలు వదులుకున్న శ్రీలీల.. ఏం చేద్దాం మరి !!

Published on: Aug 03, 2024 10:08 AM