కండోమ్‌తో జాగ్రత్త.. భవిష్యత్తులో ఆ సమస్యలు !! అధ్యయనంలో షాకింగ్ విషయాలు
కండోమ్స్ ఉపయోగించేవారికి హెచ్చరిక.. కండోమ్స్, లూబ్రికెంట్స్ కారణంగా భవిష్యత్తులో వంధ్యత్వం, క్యాన్సర్ సమస్యలు వచ్చే ప్రమాదముందని వినియోగదారుల భద్రత వేదిక మామావేషన్ సంస్థ ఓ అధ్యయనంలో వెల్లడించింది. పర్యావరణంలో కలిసిపోనటువంటి శాశ్వత రసాయనాలుగా పేర్కొనే, పీఎఫ్‌ఏఎస్ కెమికల్స్‌ను కండోమ్స్ తయారీలో వాడుతున్నారని తెలిపింది.
కండోమ్స్ ఉపయోగించేవారికి హెచ్చరిక.. కండోమ్స్, లూబ్రికెంట్స్ కారణంగా భవిష్యత్తులో వంధ్యత్వం, క్యాన్సర్ సమస్యలు వచ్చే ప్రమాదముందని వినియోగదారుల భద్రత వేదిక మామావేషన్ సంస్థ ఓ అధ్యయనంలో వెల్లడించింది. పర్యావరణంలో కలిసిపోనటువంటి శాశ్వత రసాయనాలుగా పేర్కొనే, పీఎఫ్‌ఏఎస్ కెమికల్స్‌ను కండోమ్స్ తయారీలో వాడుతున్నారని తెలిపింది. ప్రఖ్యాత బ్రాండ్ ఉత్పత్తులు సహా పలు కంపెనీల ఉత్పత్తుల్లో పీఎఫ్‌ఏఎస్ కెమికల్స్‌ను ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు గుర్తించామని వివరించింది. పీఎఫ్‌ఏఎస్ కెమికల్స్‌గా పిలిచే ఈ కెమికల్ ఎన్నేళ్లయినా ఇవి నీరు, అగ్గి, నూనె, గ్రీజు ఇలా పర్యావరణంలోని ఏ పదార్థంతోనూ కలిసిపోవు. అందుకే వీటిని ఫరెవర్ కెమికల్స్‌గా పిలుస్తారు. కార్పెంటింగ్, పెయింట్లు, ఫైర్ ఫైటింగ్ ఫోమ్స్‌లో వీటిని ఎక్కువగా వాడతారు. పీఎఫ్‌ఏఎస్ కెమికల్స్ కలిసిన కండోమ్స్, లూబ్రికెంట్స్‌ను వాడితే వంధ్యత్వం, క్యాన్సర్‌తో పాటు కాలేయం దెబ్బతినడం, థైరాయిడ్ సమస్యలు, సంతాన లోపాలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మ నగలు నావే.. మరదలికి ఇవ్వని ప్రిన్స్ విలియమ్
లద్దాఖ్ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా.. ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్న సైనికులు
పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా శునకం విధులు.. డ్యూటీ ఎలా ఉంటుందో తెలుసా ??
Sreeleela: ఆశలు వదులుకున్న శ్రీలీల.. ఏం చేద్దాం మరి !!
లావణ్య రియాక్షన్ తో.. పోలీస్ స్టేషన్‌కెళ్లిన రాజ్ తరుణ్ పేరెంట్స్