పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా శునకం విధులు.. డ్యూటీ ఎలా ఉంటుందో తెలుసా ??
సాటి మనిషిని పట్టించుకోని ఈ రోజుల్లో మనుషుల కన్నా జంతువులే ఎంతో మేలనిపిస్తున్నాయి. ఎండకు తాళలేక ఇబ్బంది పడుతున్న ఓ శునకానికి ఆశ్రయం కల్పించారన్న కృతజ్ఞత భావంతో.. అది వారిని విడిచి పోకుండా.. వాళ్లకు రక్షకుడిగా మారింది ఆ శునకం. ఆశ్రయం కల్పించిన వారికి రాత్రీ, పగలు సెక్యూరిటీ గార్డుగా మారిపోయింది. ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్‌కు వస్తున్న కస్టమర్లకు ఓ వీధి శునకం ఆకర్షణగా నిలిచింది.
సాటి మనిషిని పట్టించుకోని ఈ రోజుల్లో మనుషుల కన్నా జంతువులే ఎంతో మేలనిపిస్తున్నాయి. ఎండకు తాళలేక ఇబ్బంది పడుతున్న ఓ శునకానికి ఆశ్రయం కల్పించారన్న కృతజ్ఞత భావంతో.. అది వారిని విడిచి పోకుండా.. వాళ్లకు రక్షకుడిగా మారింది ఆ శునకం. ఆశ్రయం కల్పించిన వారికి రాత్రీ, పగలు సెక్యూరిటీ గార్డుగా మారిపోయింది. ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్‌కు వస్తున్న కస్టమర్లకు ఓ వీధి శునకం ఆకర్షణగా నిలిచింది. గత కొన్ని నెలలుగా పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డులాగా ఈ వీధి కుక్క వ్యవహరిస్తోంది. పోస్ట్ ఆఫీస్ ఉదయం తెరిచినప్పటి నుంచి మళ్లీ సాయంత్రం మూతపడే వరకు ఆ ఆఫీస్ ప్రాంగణంలోనే కాపలా కాస్తుంది. అంతేకాదు రాత్రి వేళల్లో కూడా ఇక్కడే కాపలా కాస్తూ ఎంతో విశ్వాసంగా ఉంటుందని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది చెబుతున్నారు. ఎంతోమంది పోస్ట్ ఆఫీస్ కి నిరంతరం వచ్చి పోతుంటారు. అయితే ఎవరికీ ఈ శునకం హాని కలిగించకుండా వ్యవహరిస్తోందని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది చెబుతున్నారు. అయితే రాత్రి వేళల్లో కొత్త వ్యక్తులను ఎవరిని పరిసరాల్లోకి రానివ్వదంటున్నారు. తాము ఎటువంటి ఆహారం అందించకపోయినా ఆశ్రయం కల్పించామన్న విశ్వాసంతో ఆ శునకం ఎప్పుడూ ఇక్కడే ఉంటూ పోస్ట్ ఆఫీస్ కు రక్షణగా ఉంటోందని సిబ్బంది తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sreeleela: ఆశలు వదులుకున్న శ్రీలీల.. ఏం చేద్దాం మరి !!
లావణ్య రియాక్షన్ తో.. పోలీస్ స్టేషన్‌కెళ్లిన రాజ్ తరుణ్ పేరెంట్స్
Keerthy Suresh: కళ్లు.. ఏంటి ?? కీర్తి సురేష్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్
శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య లైవ్‌లో.. షాకింగ్ రచ్చ !!
TOP 9 ET News: సుభాష్ చంద్రబోస్‌గా ప్రభాస్.. | జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్.. విజయ్ దేవరకొండ సీరియస్