AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోజురోజుకు ఎంత దిగజారుతున్నారు..? స్కూటీపై వెళ్తూ వీరి ఓవరాక్షన్ చూడండి

స్కూటీపై వెనుక కూర్చున్న యువతి.. నడి రోడ్డుపై చేసిన పని చూసి నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. మరీ ఇంత అతి పనికిరాదు తల్లీ.. అంటూ ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ అదేం వీడియోనో చూసేద్దాం పదండి.

Viral Video: రోజురోజుకు ఎంత దిగజారుతున్నారు..? స్కూటీపై వెళ్తూ వీరి ఓవరాక్షన్ చూడండి
Bathing While Driving
Ram Naramaneni
|

Updated on: May 19, 2023 | 2:00 PM

Share

ఈ మధ్య కొంతమందికి పిచ్చి పట్టింది.  సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులర్‌ అవ్వాలనే తాపత్రయంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో తింగరి వేషాలు వేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. మెట్రోరైళ్లలో, రోడ్డుమీద ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా ఓ యువతి, యువకుడు చేసిన పనికి పోలీసులు వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అదేంటో తెలుసుకుందాం పదండి.

మహారాష్ట్ర థానే ఉల్లాస్‌నగర్‌లోని ఓ సిగ్నల్‌ వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. స్కూటీపై వెళ్తున్న యువతి, యువకుడు నడిరోడ్డుమీద బకెట్‌తో నీళ్లు తీసుకొని స్కూటీమీద వెళ్తూ స్నానం చేశారు. స్కూటీ వెనక కూర్చున్న యువతి బకెట్‌లో నీటిని తానూ పోసుకుంటూ.. ఆ యువకుడి మీద పోస్తోంది. దారినపోయేవాళ్లంతా వీళ్ల పిచ్చి వేషాలు చూసి తెగ నవ్వుకున్నారు. కొందరితే పిచ్చి పట్టిందా అని కామెంట్ చేశారు. ఆ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారి పోలీసుల కంటపడింది. వీ డిజర్వ్‌ బెటర్‌ గవర్నమెంట్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ నుంచి ఈ వీడియో థానే నగర పోలీసులకు చేరింది. ఇంత జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు కదా.. వెంటనే రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌కు ఆ వీడియోను షేర్‌ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నడిరోడ్డుపై పబ్లిక్‌ న్యూసెన్స్‌కు పాల్పడడిన కారణంగా వారిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. హెల్మెట్‌ ధరించకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు సైతం వారిపై కేసు నమోదు చేసి ఛలానా విధించారు.

ఇంతకీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ముంబైకి చెందిన యూట్యూబర్‌ ఆదర్శ్‌ శుక్లా అట. తాను చేసిన పనికి సారీ చెబుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం ఏముంటుంది చెప్పండి.. అందుకే సారీ చెప్పినా చర్యలు తప్పవని థానే పోలీసులు స్పష్టం చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!