Viral Video: వామ్మో.. పాములకు సరదాగా ముద్దులు పెట్టాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్.. షాకింగ్ వీడియో
Kissing Cobra: పాములు పట్టడం అంటే అతనికి సరదా.. వాటితో ఆడుకోవడం, స్టంట్స్ చేయడం అతని హాబీ.. ఇలా పాములతో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను
Kissing Cobra: పాములు పట్టడం అంటే అతనికి సరదా.. వాటితో ఆడుకోవడం, స్టంట్స్ చేయడం అతని హాబీ.. ఇలా పాములతో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే వాడు. తాజాగా అతను తాచు పాములను (Cobra Snake) ముద్దుపెట్టుకుంటున్న వీడియోలు బాగా వైరల్అయ్యాయి. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ అధికారులు 22 ఏళ్ల ప్రదీప్ అడ్సూలేను అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర సాంగ్లీలోని బావ్చీకి చెందిన 22 ఏళ్ల ప్రదీప్ అడ్సూలే పాములను పట్టుకోని వాటి ద్వారా స్టంట్స్, బెట్టింగ్ చేస్తూ ఉండేవాడు. తాజాగా తాచు పామును పట్టుకుని దానికి ముద్దులు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం పోలీసులకు, అటవీ అధికారులకు తెలియడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సాంగ్లీ జిల్లా వాల్వా తాలూకాకి చెందిన ప్రదీప్ అశోక్ అడ్సులే పాములను పట్టుకుని వాటితో ఆడుకుంటూ.. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటాడని.. అదే విధంగా స్టంట్స్ చేయడం, బెట్టింగ్‌లకు పాల్పడటం అతని పని అని పోలీసులు తెలిపారు.
Also Read: