Mahakumbh Mela 2025: మహా కుంభమేళలో అట్రాక్షన్ అవుతున్న తేనె కళ్ల అమ్మాయి.. అసలు ఎవరీ మోనాలిసా.. ?
సోషల్ మీడియాలో ఎవరిని ఎప్పుడూ స్టార్ ను చేస్తుందో తెలియదు. గత నాలుగైదు రోజులుగా ఓ అమ్మాయి నెట్టింట సంచలనంగా మారింది. కాటుక పెట్టిన తేనె కళ్లు.. డస్కీ స్కీన్.. సింపుల్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్న ఓ సాధారణ యువతి.. ఇప్పుడు అందరి హృదయాలను దొచేస్తుంది. నెట్టింట ఇప్పుడు ఎక్కడ చూసిన ఆ అమ్మాయి వీడియోస్ కనిపిస్తున్నాయి.

ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మహా కుంభమేళా ఒకటి. ప్రయాగ్ రాజ్‌లో జనవరి 13 ప్రారంభమైన ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు, సాధువులు, అఘోరాలు చేరుకుంటున్నారు. పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ మహా కుంభమేళా వేడుకలో ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ అమ్మాయి వీడియోస్ కనిపిస్తున్నాయి.
కాటుక దిద్దిన తేనె కళ్లు.. డస్కీ స్కీన్.. అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్ తో అద్భుతమైన అందంతో కట్టిపడేస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి హీరోయిన్ కాదు. అలాగే ఓ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి కాదు. ఆమె కుంభమేళాలో దండలు అమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. ఇండోర్ కు చెందిన ఈ అమ్మాయి ఇప్పుడు అనుహ్యంగా నెట్టింట సంచలనంగా మారింది. ఆమెకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తున్నాయి.
View this post on Instagram
ఆ అమ్మాయి పేరు మోనాలిసా అని సమాచారం. ఆమె అందమైన రూపానికి, చిరునవ్వుకు కుంభమేళాకు వచ్చిన జనాలు ఫిదా అవుతున్నారు. ఆమె ఫోటోస్, వీడియోస్ నెట్టింట షేర్ చేస్తూ సహజ సౌందర్యం.. అద్భుతమైన అందం అంటూ కామెంట్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆమె కళ్లు మరింత అందంగా ఉన్నాయంటున్నారు. మరో వీడియోలో ఓ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నారా అని అడగ్గా.. లేదు అని ఆన్సర్ ఇచ్చింది. ఎవరినైనా ఇష్టపడుతున్నారా ? అని మరో వ్యక్తి అడగ్గా.. తల్లిదండ్రులు తీసుకువచ్చిన వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మాయి వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..
