AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివుడి పై వినూత్న రీతిలో భక్తిని చాటిన ఉపాధ్యాయుడు.. చాక్ పీస్ పై అతిసూక్ష్మ శివ లింగం..

మహాశివరాత్రి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ అద్భుతం సృష్టించారు. చాక్ పీస్‌పై కేవలం 1.3 సెం.మీ ఎత్తు గల సూక్ష్మ శివలింగాన్ని చెక్కి తన భక్తిని, ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారు. గుండుపిన్నుతో గంటన్నర శ్రమించి ఈ కళాఖండాన్ని రూపొందించారు. గతంలో 109 సూక్ష్మ శివలింగాలు, అతిచిన్న జాతీయ జెండా తయారుచేసి ప్రపంచ రికార్డు సాధించడం ఆయన నైపుణ్యానికి నిదర్శనం.

శివుడి పై వినూత్న రీతిలో భక్తిని చాటిన ఉపాధ్యాయుడు.. చాక్ పీస్ పై అతిసూక్ష్మ శివ లింగం..
Micro Shiva Lingam On Chalk
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 15, 2026 | 9:08 AM

Share

పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు.. శైవ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. అయితే, కాటారం లోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో శివుడిపై తన భక్తిని చాటుకున్నాడు.. చాక్ పీస్ పై అతిసూక్ష్మ పరిమాణంలో శివ లింగం చెక్కి చూపరులను అబ్బుర పరుస్తున్నాడు..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాల పనిచేస్తున్న డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ తన ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారు. శివుడి పై తన భక్తిని చాటుకున్న ఈ ఉపాధ్యాయుడు అత్యంత సూక్ష్మ పరిమాణంలో శివలింగాన్ని తయారు చేశాడు. చాక్ పీస్ పై తయారుచేసిన ఈ శివలింగం కేవలం 1.3 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.. ఈ సూక్ష్మ శివలింగాన్ని సాధారణ చాక్ పీస్‌ పై గుండుపిన్ను సహాయంతో సుమారు గంటన్నర పాటు శ్రమించి అద్భుతంగా రూపొందించారు.. ఈ కళాఖండం ద్వారా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇది మాత్రమే కాదు, గత శివరాత్రి సందర్భంగా 1.5 సెంటీమీటర్ల ఎత్తు గల 109 సూక్ష్మ శివలింగాలను చాక్ పీస్‌ లపై తయారుచేసి భక్తి, నైపుణ్యాలను ప్రతిబింబించారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ జెండాను రూపొందించి Credence Book of World Recordsలో స్థానం సంపాదించడం ఆయన ప్రతిభకు నిదర్శనం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us