5

కరోనా యాంటీ బాడీలతో పార్టీలో సందడి చేసిన పాప్ స్టార్ మడోన్నా..

తనలో కరోనా యాంటీ బాడీలు ఉన్నాయని ప్రకటించుకున్న అమెరికన్ పాప్ స్టార్ మడోన్నా.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ స్టీవెన్ క్లీన్ బర్త్ డే నాడు అతనితో పార్టీ చేసుకుంటూ కనబడడం వివాదాన్ని రేకెత్తించింది. తనకు వైరస్ సోకిందని చెప్పకనే చెప్పుకున్న...

కరోనా యాంటీ బాడీలతో పార్టీలో సందడి చేసిన  పాప్ స్టార్ మడోన్నా..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 04, 2020 | 1:12 PM

తనలో కరోనా యాంటీ బాడీలు ఉన్నాయని ప్రకటించుకున్న అమెరికన్ పాప్ స్టార్ మడోన్నా.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ స్టీవెన్ క్లీన్ బర్త్ డే నాడు అతనితో పార్టీ చేసుకుంటూ కనబడడం వివాదాన్ని రేకెత్తించింది. తనకు వైరస్ సోకిందని చెప్పకనే చెప్పుకున్న 61 ఏళ్ళ ఈ గాయని.. ఈ బర్త్ డే పార్టీలో సామాజిక దూరాన్ని పాటించకుండా స్టీవెన్ ని హగ్ చేసుకోవడం, అతనితో సన్నిహితంగా మెలగడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియోకూడా బయటికి వచ్చింది. వీరిద్దరూ న్యూయార్క్ లోనే నివసించడం కూడా విశేషం. ఈ పార్టీకి హాజరైన అనేకమంది గెస్టుల్లో ఎవరూ మాస్కులు కూడా ధరించలేదు. ఇప్పటికే అమెరికాలో కరోనా మృతుల సంఖ్య  66 వేలకు పైగా పెరిగింది. అయితే మడోన్నా మేనేజర్ మిషెల్ మాత్రం ఈ పార్టీకి కేవలం అయిదుగురు మాత్రమే హాజరయ్యారని, అంతా నెల రోజులకు పైగా క్వారంటైన్ లో ఉన్నారని పేర్కొన్నారు. మడోన్నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, వారిని ఆమె రిస్క్ లో పెట్టలేదన్నారు.

ఈ స్టార్‌ సెలబ్రిటీల పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..
ఈ స్టార్‌ సెలబ్రిటీల పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..
స్పందించకపోతే ఏంటి..? ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
స్పందించకపోతే ఏంటి..? ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది.? తాప్సీ
వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది.? తాప్సీ
తెలంగాణలో విష జ్వరాలు విజృంభణ.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు
తెలంగాణలో విష జ్వరాలు విజృంభణ.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు
చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందిగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందిగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం