వానర చేష్ట.. ‘చిన్నారిని కిడ్నాప్ చేసిన’ వీడియో ! చూడాల్సిందే !

వానర చేష్ట.. 'చిన్నారిని కిడ్నాప్ చేసిన' వీడియో ! చూడాల్సిందే !

కోతి చేష్ట.. చిలిపి చేష్ట అని సరదాగా అనుకున్నా ఈ ఘటన మాత్రం కాస్త హారిబుల్ గానే ఉంది. అది ఏ ప్రాంతమో, ఏ సిటీయో తెలియదు గానీ.. ఓ ఇంటి ముందు జరిగింది ఓ విచిత్రం. ఒక కోతి పిల్లలాడుకునే చిన్న సైకిల్ ఎక్కి.. వేగంగా వస్తూ.. ఆ ఇంటి ముందు మరికొందరు పిల్లలతో కూచున్న...

Umakanth Rao

| Edited By: Anil kumar poka

May 04, 2020 | 2:01 PM

కోతి చేష్ట.. చిలిపి చేష్ట అని సరదాగా అనుకున్నా ఈ ఘటన మాత్రం కాస్త హారిబుల్ గానే ఉంది. అది ఏ ప్రాంతమో, ఏ సిటీయో తెలియదు గానీ.. ఓ ఇంటి ముందు జరిగింది ఓ విచిత్రం. ఒక కోతి పిల్లలాడుకునే చిన్న సైకిల్ ఎక్కి.. వేగంగా వస్తూ.. ఆ ఇంటి ముందు మరికొందరు పిల్లలతో కూచున్న ఓ చిన్నారి వరకు వఛ్చి హఠాత్తుగా ఆమెను కింద పడేసి లాక్కుపోవడం చూస్తే ఒళ్ళు గగుర్పొడవక మానదు. అంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఆ పాపను వానరం చెయ్యిపట్టి ఈడ్చుకుపోతుండగా అప్పుడే ఆ దృశ్యం చూసిన వ్యక్తి ఒకరు గాభరాగా కేకలు పెడుతూ పరుగెత్తుకు రావడంతో.. కోతి ఆమెను వదిలి అదే సైకిల్ మీద ‘పరారైంది’.కింద పడిపోయిన చిన్నారి లేచి నడచుకుంటూ ఇంటిదగ్గరకు చేరుకుంది. ఈ వీడియోను సుమారు నాలుగు మిలియన్ల మంది చూసి ఆశ్చర్యపోయారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాకపోయినా.. ఈ సంఘటనతో భయపడిపోయి..  చాలాసేపు కోలుకోలేకపోయిందట!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu