తస్మాత్ జాగ్రత్త ! కరోనాతో వారికే అధిక ముప్పు ?
కోవిడ్ మహమ్మారి ప్రాణాంతకతను కలిగించడమే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసింది. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్

ప్రపంచవ్యాప్తంగా మానవళి మనుగడకే కరోనా సవాలుగా మారింది. కోవిడ్ మహమ్మారి ప్రాణాంతకతను కలిగించడమే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసింది. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రపంచ పరిశోధకులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైరస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా ఫలితాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిశోధనల్లో వైరస్ కారణంగా మహిళలకు ముప్పు తక్కువగా ఉంటుందనే విషయం వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే, తాజగా మరో అధ్యయనం బయటపెట్టారు శాస్త్రవేత్తలు. ఆ నివేధిక మేరకు…
కరోనా వైరస్ మహిళల కంటే పురుషులకే ఎక్కువ గా ముప్పు ఉంటుందని, ఊబకాయం ఉన్న వారిపై తీవ్రత అధికంగా ఉంటుందని ఒక సర్వే తెలిపింది. లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడటం మరణించడం జరుగుతుందని ఆ సర్వే పేర్కొంది. కొందరు కరోనా సోకినా ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉంటుందని సర్వే వెల్లడించింది. ఈ తరుణంలో వైరస్ కారణంగా ఎవరు ఎక్కువగా మరణించే అవకాశం ఉంది అనే దాని మీద ఒక సర్వే చేసారు. ఊబకాయం ఉన్నవారికి వైరస్ సోకితే మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందనీ, ఈ వైరస్ కారణంగా ముఖ్యంగా పురుషులకే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ఆ సర్వే వెల్లడించింది.
Follow Us
