Watch Video: హవ్వా! నడిరోడ్డుపై రెచ్చిపోయిన లవర్స్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Lovers Romance: ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో యువతీ యువకులు రెచ్చిపోతున్నారు. పట్టపగ్గాల్లేకుండా.. పబ్లిక్ ప్లేసుల్లోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కన్నుమిన్ను కానక..

ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో యువతీ యువకులు రెచ్చిపోతున్నారు. పట్టపగ్గాల్లేకుండా.. పబ్లిక్ ప్లేసుల్లోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కన్నుమిన్ను కానక.. బరితెగించి రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో ఓ ప్రేమ జంట బైక్‌పై అసభ్యంగా కూర్చుని వెళ్లిన ఘటన మరువక ముందే.. సేమ్ అలాంటి సీన్ మరో రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇంతకు ముందు వైరల్ అయిన వీడియోని మించిన సీన్ ఇందులో ఉండటం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియో ఏముందో ఒకసారి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రద్దీ గల రోడ్డుపై బైక్ మీద ఇద్దరు ప్రేమికులు వెళ్తున్నారు. అయితే, సాధారణంగా వెళితే ఎవరూ పట్టించుకునేవారు కాదు, ఇంత రచ్చ జరిగేది కాదు. బరితెగించి మరీ అసభ్యకరంగా ప్రవర్తించారు. అబ్బాయి బైక్ నడుపుతుండగా.. అమ్మాయి అతని ముందువైపు కూర్చుని హత్తుకుంది. అలా కూర్చున్న యువతి ఊరుకుంటేనా.. చుట్టూ జనాలు ఉన్నారు, ట్రాఫిక్ అనే సోయి కూడా లేకుండా అబ్బాయిపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ సీన్‌ను కొందరు తమ ఫోన్‌లో వీడియో తీశారు.




ఆ వీడియోను సాక్షి పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆగ్రహంతో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై లక్నో పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. వీడియోలో ఉన్న జంట కోసం గాలింపు చేపట్టారు. లక్నోలోని హజ్రత్ గంజ్వారీ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు సీసీ ఫుటేజీ సహా అన్ని రకాల మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో అసభ్యంగా ప్రవర్తించిన వీరిద్దరిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో ఇదే..
नबाबों का शहर Lucknow उत्तर प्रदेश pic.twitter.com/dZ92Sn1R0E
— sakshi (@ShadowSakshi) January 17, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
