Viral Video: వామ్మో! అగ్గిపెట్టె లాంటి చిన్న గది.. అద్దె ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది..!
ఎన్నో కలలు, ఆపై ఇంకెన్నో ఆశలతో ఎంతోమంది సొంతూళ్లను వదిలేసి.. మెట్రోపాలిటన్ సిటీల బాటపడుతుంటారు. అక్కడే ఏ పనిలోనూ, లేక ఉద్యోగంలోనూ చేరి బాగా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు. మరి సొంత ఊరి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లినప్పుడు సింగిల్ రూమ్ లేదా అపార్ట్‌మెంట్‌లో..
ఎన్నో కలలు, ఆపై ఇంకెన్నో ఆశలతో ఎంతోమంది సొంతూళ్లను వదిలేసి.. మెట్రోపాలిటన్ సిటీల బాటపడుతుంటారు. అలాగే విదేశాలకు కూడా వెళ్తుంటారు. అక్కడే ఏ పనిలోనూ, లేక ఉద్యోగంలోనూ చేరి బాగా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు. మరి సొంత ఊరి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లినప్పుడు సింగిల్ రూమ్ లేదా అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉండాల్సి వస్తుంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాల్లో అద్దెకు చిన్న రూమ్ తీసుకోవాలంటేనే.. భారీగా డబ్బు చెల్లించాల్సిందే. అటు విదేశాలలోనూ ఇదే సంగతి. ఇక ఇప్పుడు అదే పంధాలో ఇంటర్నెట్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ చిన్న అగ్గిపెట్టె లాంటి 1BHK అపార్ట్‌మెంట్ తాను ఇంత అద్దె చెల్లిస్తున్నానంటూ ఒక మహిళ.. నెటిజన్లతో పంచుకుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..!
వైరల్ వీడియో ప్రకారం.. ఓ మహిళ తాను అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను నెటిజన్లకు చూపిస్తుంది. ఆ అపార్ట్‌మెంట్ తలుపు తెరిచిన వెంటనే.. ముందు ఒక మంచం కనిపిస్తుంది. దాని పక్కనే ఓ చిన్న వార్డ్‌రోబ్.. అలాగే అక్కడ చాలా చిన్న స్థలం ఉంది. ఆ మంచం ముందు టీవీ కూడా అమర్చబడి ఉంది. అటు ఆ పక్కనే బాత్రూంను కూడా చూపించింది. చాలా చిన్నది.. ఈ చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యక్తి కూడా ఊపిరాడకుండా ఉండొచ్చునేమో.. ఇక ఈ చిన్న అపార్ట్‌మెంట్ ఉన్నది లండన్‌లో.. నెలకు దీని అద్దె సుమారు రూ. 1 లక్ష 95 వేలు.
కాగా, ఈ వీడియోను ‘instablog9ja’ అనే ట్విట్టర్ ఖాతా నెట్టింట పోస్ట్ చేసింది. కేవలం 20 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 5 మిలియన్ల మంది వీక్షించారు. 8 వేల మందికి పైగా దీనిని లైక్ చేశారు. అదే సమయంలో ఈ వీడియోను చూసి నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘విలాసవంతమైన అపార్ట్‌మెంట్ అనుకుంటే.. స్కాం బయటపడిందే’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘లండన్‌లో పూర్తిగా దోపిడీ జరుగుతోందని’ అని మరొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ లుక్కేయండి.
London resident gives a tour of his £1850 per month apartment pic.twitter.com/gzskZanmZw
— Instablog9ja (@instablog9ja) April 6, 2024