Viral Video: 38 సెకన్లలో 75 జిల్లాల పేర్లు.. అది కూడా అక్షర క్రమంలో.. చిన్నారి ట్యాలెంట్‌కు నెటిజన్ల ఫిదా

Uttar Pradesh: ఇటీవల కొందరు చిన్నారులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కష్టసాధ్యమైన పనులు చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక 38 సెకెన్లలో రాష్ట్రంలోని 75 జిల్లాల పేర్లన్నీ చెప్పేసింది.

Viral Video: 38 సెకన్లలో 75 జిల్లాల పేర్లు.. అది కూడా అక్షర క్రమంలో.. చిన్నారి ట్యాలెంట్‌కు నెటిజన్ల ఫిదా
Little Girl
Follow us
Basha Shek

|

Updated on: Sep 13, 2022 | 7:57 PM

Uttar Pradesh: ఇటీవల కొందరు చిన్నారులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కష్టసాధ్యమైన పనులు చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక 38 సెకెన్లలో రాష్ట్రంలోని 75 జిల్లాల పేర్లన్నీ చెప్పేసింది. అది కూడా అక్షరక్రమంలో. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. చిన్నారి ట్యాలెంట్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో అంటూ సామెతలను గుర్తు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. యూపీలోని దియోరియా జిల్లాకు చెందిన మాన్వి చౌరాసియా ఆద‌ర్శ్ ప్రాథమిక విద్యాల‌య పాఠశాలలో చదువుతోంది. ఏ తరగతి చదువుతుంతో తెలియదు కానీ ఇటీవల ఈ చిన్నారి యూపీ రాష్ట్రంలోని 75 జిల్లాల పేర్లను అక్షర క్రమంలో చెప్పేసింది. అది కూడా కేవలం 38 సెకన్ల వ్యవధిలోనే.

దీనికి సంబంధించిన వీడియోను శుభాంకర్‌ మిశ్రా అనే ట్విట్టర్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘అమేజింగ్ గర్ల్‌. ఈ బాలిక నైపుణ్యానికి మీరు కూడా సెల్యూట్‌ చేస్తారు’ అని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 26.5 వేల వ్యూస్‌ వచ్చాయి. అలాగే 3వేలకు పైగా లైకులు, 585 రిట్వీట్లు వచ్చాయి. ‘బాలికకు మంచి భవిష్యత్‌ ఉంది’, ‘ఇంటెలిజెంట్‌ గర్ల్..అమ్మాయి చాలా చురుకుగా ఉంది’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..