Viral Video: లైకుల కోసం మరీ ఇంతలా పిచ్చోడ్ని చేయాలా.? ఈ యువతి ఏం చేసిందో చూస్తే మైండ్ బ్లాంకే!
ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిల్చుని ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక అప్పుడే ఓ యువతి..
పిక్‌పాకెటింగ్, మొబైల్ ఫోన్‌లను స్వైప్ చేయడం, స్నాచింగ్ చేయడం వంటివి దేశంలో సర్వసాధారణమైపోయాయి. అందుకే రోడ్లపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ తెలివైన దొంగ చేతిలో ఈ వ్యక్తి తన పర్స్ ఎలా పోగొట్టుకున్నాడో మీరే చూడండి..
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిల్చుని ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక అప్పుడే ఓ యువతి అక్కడికి వస్తుంది. ఏదో అడ్రస్ కోసం అతడ్ని అడుగుతుంది. ఇంత వరకూ బాగానే ఉంది కదా.. అసలు ట్విస్ట్ ఇప్పుడే వస్తుంది. ఆ యువతి అడ్రస్ అడుగుతూ అతడి వెనుక జేబులో ఉన్న పర్స్‌ను కాజేస్తుంది. పని పూర్తయిన వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఆ వ్యక్తిని యువతి భలేగా బురడీ కొట్టించిందిగా’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఇదొక ప్రాంక్ వీడియో అని చెప్పుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.