Viral Video: దెబ్బకు అబ్బ గుర్తుకురావాల్సిందే.. వేటకు వచ్చిన సింహానికి చుక్కలు చూపించిన జిరాఫీ.. తొక్కిపడేసి..
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వింతలకు నిలయం.. నిత్యం వైరల్ అయ్యే వీడియోలు ఫన్నీగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే, సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వింతలకు నిలయం.. నిత్యం వైరల్ అయ్యే వీడియోలు ఫన్నీగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే, సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. చాలా వీడియోలలో సింహం, చిరుత లేదా పులి ఇతర జంతువులను వేటాడడం మాత్రమే చూసుంటారు. ఈ జంతువులు అడవిలో ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తాయి. అలాంటి క్రూర జంతువులకు మరికొన్ని జంతువులు సవాల్ చేసి.. ప్రాణాలను కాపాడుకుంటాయి. అయితే ఇప్పుడు బయటికొచ్చిన వీడియోలో అలాంటి దృశ్యమే కనిపిస్తోంది. సింహం.. జిరాఫీ వేటకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో జిరాఫీ.. సింహాన్ని దారుణంగా దెబ్బకొడుతుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో సింహం వేట కోసం అడవిలో సంచరిస్తున్నట్లు కనిపిస్తుంది. కొంత సమయం తరువాత.. దాని కళ్ళు జిరాఫీపై పడ్డాయి. దానిని వేటాడేందుకు సిద్ధమై.. ముందుకు దూసుకెళ్తుంది. వెంటనే సింహం.. జిరాఫీపైకి దూకి దాడి చేయగానే, జిరాఫీ సింహానికి కోలుకోలేని దెబ్బకొడుతుంది. మెడ పట్టుకున్న సింహం.. వేలాడుతూ జిరాఫీ పాదాల దగ్గరకు వస్తుంది. దీంతో జిరాఫీ కాళ్లతో గట్టిగా తన్నుతుంది. ఇలా ఒక్కసారే కాదు.. గట్టిగా నాలుగైదు సార్లు కాళ్లతో గాయపరుస్తుంది.
అయితే.. జిరాఫీ ధాటికి సింహం విలవిలలాడిపోతుంది. చివరకు హమ్మయ్య.. బతికిపోయానంటూ ఊపిరిపీల్చుకుంటుంది. ః
వీడియో చూడండి..
View this post on Instagram
సింహం వేటకు సంబంధించిన వీడియోను animalcoterie అనే యూజర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. వేలాది మంది వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు. సింహానికి.. జిరాఫీ దిమ్మ తిరిగే షాకిచ్చిందటూ పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..