Viral Video: ఆటో ప్రయాణం.. ప్రాణాలు మాత్రం అటో.. ఇటో..! ఒక్క వాహనంలో 50 మందికి పైగా.. చివరకు..
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా, ఓ ఆటోకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా, ఓ ఆటోకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఆటోలో 50 మందికి పైగా ప్రయాణించడం ఒక్కసారిగా కలకలం రేపింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రయాణికులను నింపడానికి, డ్రైవర్లు ఓవర్‌లోడ్ చేయడం.. ప్రయాణీకుల ప్రాణాలను పట్టించుకోకపోవడం తరచుగా కనిపిస్తుంది. అలాంటి సందర్భంలో ఒక ఆటో రిక్షా డ్రైవర్ పది, ఇరవై కాదు ఏకంగా యాభై మంది ప్రయాణికులను కూర్చోబెట్టాడు. అయితే దాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌లో జరిగింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ వీడియో కొన్ని నెలల క్రితం నాటిది. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం, కొంతమంది దీపావళి (అక్టోబర్ 5) సందర్భంగా ఎక్కడో జాతర చూసి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో అక్టోబరు నాటిదని పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో జాతరను వీక్షించేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఈ వీడియో అలీరాజ్‌పూర్ జిల్లాలోని జోబాత్‌కి సంబంధించినదని పోలీసులు తెలిపారు. అలిరాజ్‌పూర్ నగరం లేదా సుదూర ప్రాంతాల నుంచి ఒకటి లేదా రెండు వాహనాలు మాత్రమే వస్తుంటాయని.. అందుకే ఒక్కో వాహనంపై ఇలా చాలా మంది ఎక్కుతుంటారని పేర్కొంటున్నారు.
వీడియో చూడండి..
अलीराजपुर एक्सप्रेस !
मध्य प्रदेश के आदिवासी बहुल अलीराजपुर ज़िले की यही मैट्रो ट्रेन है और यही OLA, UBER। यहां ऑटो में लोग बैठाए नहीं ठूसे जाते है।
यह ज़िला देश के सबसे साफ़ शहर इंदौर से सिर्फ़ 200 किलोमीटर की दूरी पर है। pic.twitter.com/qTDq6WxUjo
— काश/if Kakvi (@KashifKakvi) December 6, 2022
ఈ వీడియోలో ప్రయాణికులు ఆటోకి ఇరు వైపులా వేలాడుతూ కనిపించారు. ఇంటికి తిరిగి వెళ్లాలనే కొరికతో ప్రజలు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ వేలాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆటో నంబర్ ప్లేట్‌ను పరిశీలించి ఆటోను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..