Viral Video: జిరాఫీ పిల్లను వెంటాడి వేటాడిన ఆడ సింహం.. కట్ చేస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు.!
అడవి ప్రపంచం ఎప్పుడూ వింతలూ-విశేషాలతో నిండి ఉంటుంది. సాధు జంతువులు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తే...

అడవి ప్రపంచం ఎప్పుడూ వింతలూ-విశేషాలతో నిండి ఉంటుంది. సాధు జంతువులు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తే.. క్రూర జంతువులు ఎలప్పుడూ వేటపైనే దృష్టి సారిస్తాయి. జాలి, దయ అనే లక్షణాలను ముఖ్యంగా వేటాడేటప్పుడు క్రూర జంతువులు పట్టించుకోవు. ఇలా జీవనపోరాటాల మధ్య సాగే ప్రతీ దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకే సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి.
అడవికి రారాజు సింహం. సాధారణంగా సింహాన్ని దూరం నుంచి చూస్తే చాలు.. మిగతా జంతువులు పరుగులు పెడతాయి. సింహం పంజా పవర్ అలాంటిది మరి. ఎంతటి భారీ జంతువునైనా సింహం వేటాడగలదు. అయితే అప్పుడప్పుడూ అడవికి రాజైన సింహం కూడా ఓటమిని ఎదుర్కోక తప్పదు. సరిగ్గా ఇక్కడా అదే జరిగింది. జిరాఫీ పిల్లను ఓ ఆడ సింహం క్షణాల్లో వేటాడేసింది. అయితే చివర్లో సీన్ కాస్తా రివర్స్ అయింది. అదేంటో చూసేద్దాం..
వైరల్ వీడియో ప్రకారం.. జిరాఫీల గుంపు నుంచి ఓ ఆడ జిరాఫీ, జిరాఫీ పిల్ల తప్పిపోయినట్లు మీరు చూడవచ్చు. వాటిని దూరం నుంచి చూసిన ఓ ఆడ సింహం.. వేటాడేందుకు వెంటపడింది. మట్టుబెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూసింది. ఇక ఆ క్షణం రానే వచ్చింది. ఆడ సింహం నుంచి తప్పించుకునే క్రమంలో జిరాఫీ, జిరాఫీ పిల్ల రెండూ వేర్వేరు అయ్యాయి. అదే అదునుగా చేసుకుని జిరాఫీ పిల్లపై సింహం విరుచుకుపడింది. తన పదునైన దవడలతో ఆ పిల్లను నోటకరుచుకుని నది ఒడ్డుకు తీసుకెళ్లింది.
ఆడ సింహం పంజా దెబ్బకు జిరాఫీ పిల్ల ప్రాణాలు కోల్పోయిందని అక్కడికొచ్చిన పర్యాటకులు అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా జిరాఫీ పిల్ల స్పృహలోకి వచ్చి.. తనను తాను రక్షించుకునేందుకు నదిలోకి దిగింది. సుమారు 7 గంటల పాటు అందులోనే ఉంది. అయితే ఆడ సింహం చేసిన గాయాలకు నిలవలేకపోయిన జిరాఫీ పిల్ల.. నీటిలో మునిగి తన ప్రాణాలను వదిలింది. కాగా, ఈ షాకింగ్ వీడియోను పర్యాటకులు తీయగా.. ఇది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
WATCH:
While still learning to walk, a newborn giraffe must fight for its life from a hungry lioness with only the protection of its mother!
The giraffe escapes the lioness, but the ending is something you’d never expect! https://t.co/PeR5XKZu5B pic.twitter.com/2z1seqBn9s
— Kruger Sightings (@LatestKruger) November 24, 2021
కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!
ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!
ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?