Shocking Video: సింహం పరిగెత్తుకు వస్తున్నా ఫైటింగ్ ఆపని జింకలు, చివరకు ఏం జరిగిందంటే..?
అడవికి రాజైన సింహం అంటే అన్ని జంతువులు భయపడతాయి. సింహం వేట ఎంత సాలిడ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎదురుగా ఎంత పెద్ద జంతువున్నా
అడవికి రాజైన సింహం అంటే అన్ని జంతువులు భయపడతాయి. సింహం వేట ఎంత సాలిడ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎదురుగా ఎంత పెద్ద జంతువున్నా దాని ముందు నేలకొరగాల్సిందే. కాపు కాసి వేటాడటం, వేగంగా వెళ్లి ఎదురుగా అటాక్ చేయడం ఈ రెండు పద్దతులను సింహాలు అవలంభిస్తాయి. సమయం, సందర్బానుసారం అవి వేటాడే స్టైల్ మార్చుకుంటూ ఉంటాయి. సింహం వేటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మీ ముందుకు అలాంటి ట్రెండింగ్ వీడియోను తీసుకొచ్చాం. స్వయంకృపారాధంతో ఒక జింక తనకు తానుగా సింహానికి ఆహారం అయిపోయింది.
ముందుగా ఆ వీడియోను వీక్షించండి…
، ? pic.twitter.com/gJIYAfrHEn
— Life and nature (@afaf66551) July 9, 2021
ఈ వీడియోలో కొన్ని జింకలు అడవిలో ఆడుకుంటూ ఉండటం మీరు చూడవచ్చు. అందులో ఒక రెండు జింకలు కొమ్ములతో ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నాయి. ఈ క్రమంలో దూరంగా ఉన్న సింహం.. వీటిని గమనించి దూసుకుని వచ్చింది. మిగిలిన జింకలన్నీ అక్కడి నుంచి పరారయ్యాయి. పోట్లాడుకుంటున్న రెండు జింకలు మాత్రం.. ఎలాంటి బెరుకు లేకుండా తమ యుద్దాన్ని కొనసాగించాయి. తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ అవి మాత్రం ఆ పని చెయ్యలేదు. ఇంతలో సింహం అక్కడికి రానే వచ్చింది. రెండు జింకల్లో ఒకటి తప్పించుకుని వెళ్లిపోగా.. మరొకటి మాత్రం దానికి ఆహారం అయిపోయింది. ఈ షాకింగ్ వీడియో లైఫ్ అండ్ నేచర్ అనే పేజీలో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. మరికొందరు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ ఫేమ్, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ కన్నుమూత