ఓరీ దేవుడో.. క్షణాల్లో ఊరిని మింగేసిన సముద్రం..! భయానక వీడియో వైరల్..
ఒక హృదయ విదారక వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిలో మొత్తం గ్రామం క్షణాల్లో సముద్రంలో మునిగిపోతుంది. ఎనిమిది ఇళ్ళు కేవలం రెండు నిమిషాల్లోనే సముద్రపు అలలలో కలిసిపోయాయి. వీడియోలో భూమి నెమ్మదిగా సముద్రం వైపు ఎలా జారడం ప్రారంభిస్తుందో, ఆపై అకస్మాత్తుగా మొత్తం గ్రామం నీటిలో మునిగిపోతుందో వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ భయానక దృశ్యం చూస్తుంటే శరీరంలో వణుకు పుట్టుకోస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వణికిపోతున్నారు. ఈ సంఘటన 2025 సెప్టెంబర్ 2న జరిగింది. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటం వలన, కేవలం రెండు నిమిషాల్లో ఎనిమిది ఇళ్ళు సముద్రపు అలలలో అదృశ్యమయ్యాయి. నార్వేలోని ఆల్టా నగరానికి సంబంధించిన ఒక హృదయ విదారక వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిలో మొత్తం గ్రామం క్షణాల్లో సముద్రంలో మునిగిపోతుంది. ఎనిమిది ఇళ్ళు కేవలం రెండు నిమిషాల్లోనే సముద్రపు అలలలో కలిసిపోయాయి. వీడియోలో భూమి నెమ్మదిగా సముద్రం వైపు ఎలా జారడం ప్రారంభిస్తుందో, ఆపై అకస్మాత్తుగా మొత్తం గ్రామం నీటిలో మునిగిపోతుందో వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ సంఘటన ఎందుకు జరిగింది..?
ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిసింది. కానీ ఒక కుక్క నీటిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని తన ప్రాణాలను కాపాడుకుంది. కొండచరియలు విరిగిపడటానికి కారణం నార్వే వంటి ప్రాంతాలలో కనిపించే చాలా సున్నితమైన, బంకమట్టి అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేల స్వల్ప ఒత్తిడిలో కూడా ద్రవ రూపంలోకి మారుతుందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఇంతటి వినాశకరమైన ప్రమాదాలకు దారితీస్తుందని సమాచారం.
వీడియో ఇక్కడ చూడండి..
This is crazy pic.twitter.com/OaIySHs5LZ
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 2, 2025
ఈ సంఘటన దశాబ్దాలలో ఆల్టా ప్రాంతంలో జరిగిన అతిపెద్ద విపత్తు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రకృతి, ఈ క్రూరత్వాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ప్రకృతి ముందు మనిషి ఎంత నిస్సహాయంగా ఉన్నాడో ఈ సంఘటన మరోసారి మనకు గుర్తు చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




