Maggi Milkshake: వారెవ్వా.. మ్యాగీని ఇలా కూడా చేస్తారా.. నెట్టింట్లో వైరలవుతున్న నయా వంటకం..
కేవలం ఐదు నిమిషాల్లో రిస్క్ లేకుండా రెడీ అయ్యే వంటకం ఏదైనా ఉంది అంటే... మ్యాగీ మాత్రమే. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇష్టపడుతుంటారు
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. నిజమే అనిపిస్తుంది. రెగ్యూలర్ గా చేసే వంటలు చాలా మందికి విసుగు పుట్టేలా చేస్తాయి. మ్యాగీని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఐదు నిమిషాల్లో రిస్క్ లేకుండా రెడీ అయ్యే వంటకం ఏదైనా ఉంది అంటే… మ్యాగీ మాత్రమే. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇష్టపడుతుంటారు. రుచికరమైన మ్యాగీని రెడీ చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. ఇక మ్యాగీని రకరకాలుగా ట్రై చేసిన వీడియోలను మనం చూసే ఉంటాం. గతంలో మ్యాగీని పానీపూరీతో జతచేసిన తెలిసిందే. ఇక అలాగే మ్యాగీ పులిహోరా, మ్యాగీ ఉప్మా, మ్యాగీ ఫ్రై ఇలా ఎన్నో వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు నెట్టింట్లో మరో కొత్త వంటకం చక్కర్లు కొడుతుంది. పాలతో మ్యాగీ వినూత్న వంటకం రెడీ చేస్తున్నారు. మ్యూగీ మిల్క్ షేక్ అంటూ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. మ్యాగీతో మిల్స్ షేక్ చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో రకారకాల వంటకాలు వైరల్ అవుతున్నాయి. రెగ్యూలర్గా వంటలైనా.. కాస్త వెరైటీగా ట్రై చేస్తే చాలు.. తెగ వైరల్ అవుతుందో. అంతేకాదు.. ఇలాంటి ఢిపరెంట్ వంటలను ట్రై చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మిల్క్ షేక్ మ్యాగీ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఈ వీడియో పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ డిఫరెంట్ వంటకాన్ని మీరు కూడా చూసేయ్యండి.
ట్వీట్స్..
Maggi milkshake. Everyday we stray further from God’s light.
Via @YearOfRat pic.twitter.com/Me0VsOayJs
— Angad Singh Chowdhry (@angadc) September 11, 2021
View this post on Instagram
Some idiot share this with me…
Maggie Milk-shake…. Jinda pakadna hai in banane waalo ko… ??? pic.twitter.com/m0BV8m7zyI
— Mayur Sejpal | मयूर सेजपाल ?? (@mayursejpal) September 11, 2021
Prakash Raj: ప్రకాష్ రాజ్ మంచితనం.. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన విలక్షణ నటుడు..