AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘనంగా వివాహం జరిగింది.. ఫస్ట్ నైట్ రోజే నగలతో పెళ్లి కూతురు జంప్.. కట్‌చేస్తే..

రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌లో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కిషన్‌గఢ్‌లో జరిగిన ఒక వివాహం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఘనంగా జరిగిన వివాహ వేడుక, ఊరేగింపు అంతా సాధారణంగానే అనిపించింది. కానీ, వధూవరుల మొదటి రాత్రి ఊహించని మలుపు తిరిగింది. వివాహం జరిగిన రోజు రాత్రి, అత్త కోడలికి నగలు బహుకరించింది. అయితే, వధువు తన భర్తతో మొదటి రాత్రిని నిరాకరించింది. అర్ధరాత్రి సమయంలో వధువు నగలు, నగదుతో పాటు అదృశ్యమయ్యింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది.

ఘనంగా వివాహం జరిగింది.. ఫస్ట్ నైట్ రోజే నగలతో పెళ్లి కూతురు జంప్.. కట్‌చేస్తే..
Wedding
Jyothi Gadda
|

Updated on: Sep 30, 2025 | 3:50 PM

Share

అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్‌లో జరిగిన ఒక వివాహం చర్చనీయాంశమైంది. ప్రతిధ్వనించే డప్పు చప్పుడు, అతిథుల హర్షధ్వానాలు, వధువు అందమైన ఎంట్రీ. అంతా చాలా సాధారణంగా అనిపించింది. కానీ మొదటి రాత్రి వచ్చేసరికి అసలు కథ బయటపడింది. కిషన్‌గఢ్‌లో రాకేష్ అనే యువకుడి వివాహం జైపూర్‌లో చాలా వైభవంగా జరిగింది. ఆగ్రా నుండి వధువు సాంప్రదాయ ఆచారాల మధ్య వచ్చి, ఆచారాల ప్రకారం ఏడు ప్రమాణాలు చేసి, వరుడితో కలిసి కిషన్‌గఢ్‌కు చేరుకుంది. వరుడి తల్లి తన కోడలిని స్వాగతించింది. బంగారు ఆభరణాలతో అలంకరించింది. కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇంట్లో కొత్త వెలుగు నింపుతుందని అందరూ భావించారు. కానీ, అంతలోనే కథ అడ్డం తిరిగింది.

వివాహం తర్వాత వారికి మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. వరుడు తన గదికి వస్తూ ఇది కొత్త జీవితానికి నాంది అని భావించాడు. కానీ, ఇక్కడే వధువు అతనికి ఊహించని షాక్‌ ఇచ్చింది. ఈ రోజు మన ఫస్ట్‌ నైట్‌ కుదరదని, ఇది మా ఆచారం అంటూ నమ్మించింది. వరుడు గుడ్డిగా నమ్మేశాడు. ఆ తర్వాత అర్థరాత్రి మూడు గంటల ప్రాంతంలో మంచి నీళ్ల కోసం లేచిన అతనికి గదిలో వింత సీన్‌ కనిపించింది. గది తలుపు సగం తెరిచి ఉంది. అల్మారా చిందరవందరగా ఉంది. దగ్గరగా చూసేసరికి, వధువు కనిపించడం లేదని అతనికి అర్థమైంది. ఆమె మాత్రమే కాదు, అల్మారాలోని బంగారు నగలు, నగదు కూడా మాయమయ్యాయి. ఇల్లు మొత్తం గందరగోళంలో పడింది. బంధువులు, ఇరుగు పొరుగువారు గుమిగూడారు. కానీ వధువు జాడ కనిపించలేదు.

బాధిత వరుడి కుటుంబం ఆ వివాహం జితేంద్ర అనే బ్రోకర్ ద్వారా కుదుర్చుకున్నారు. ఆగ్రాకు చెందిన ఈ యువతి కోసం అతను పూర్తిగా రెండు లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ అమ్మాయి ధనవంతులైన కుటుంబానికి చెందినదని, వారి వివాహం పరిపూర్ణంగా ఉందని కుటుంబానికి హామీ ఇచ్చారు. వివాహం జైపూర్‌లో సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ప్రతిదీ సాధారణంగానే అనిపించింది. ఈ వివాహం ఒక స్కామ్‌లో భాగమని ఆ తరువాత అర్థమైంది. చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!