Viral Video: కేరళలో ఆటో డ్రైవర్లు కూడా ఇంగ్లిష్ మాట్లాడతారు.. ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
డిజిటల్ యుగంలో ఒక భాషను నేర్చుకోవడం చాలా ఈజీ. అనేక యాప్స్ తో కష్టసాధ్యమైన భాషను నేర్చుకోవచ్చు. అయితే పర్యాటకులను ఆకర్షించడానికి చాలా మంది ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. వారి అవసరం కూడా. అయితే ఇదే తరహాలో ఓ ఆటోడ్రైవర్ అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడి పర్యాటకుడికి సాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డిజిటల్ యుగంలో ఒక భాషను నేర్చుకోవడం చాలా ఈజీ. అనేక యాప్స్ తో కష్టసాధ్యమైన భాషను నేర్చుకోవచ్చు. అయితే పర్యాటకులను ఆకర్షించడానికి చాలా మంది ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. వారి అవసరం కూడా. అయితే ఇదే తరహాలో ఓ ఆటోడ్రైవర్ అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడి పర్యాటకుడికి సాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ బ్రిటీష్ టూరిస్టుకు కేరళ డ్రైవర్ మాట సాయం చేయడం కూడా చూడొచ్చు. ఎటీఎం మెషిన్ పనిచేయకపోవడంతో తాను ఉంటున్న హోటల్ నుంచి బయటకు వస్తాడు టూరిస్టు.
అయితే రోడ్డుపై నడుచుకు వెళ్తాడు. ఈ సమయంలో అష్రాఫ్ అనే ఆటోడ్రైవర్ ను కలిసి ఏటీఎం ఎక్కడ్నుందో చెబుతానని అంటాడు. అతనికి ఇంగ్లీష్ లో మంచి స్కిల్స్ ఉండటం గమనించాడు. దగ్గర్లో ఏవైనా ఏటీఎంలు ఉంటే తీసుకు వెళ్లాలని కొరతాడు. ఈ విషయాన్ని అష్రఫ్ అనర్గళంగా ఇంగ్లిష్ లో తెలియజేశాడు. ఆ తర్వాత అష్రఫ్ అతడిని తన ఆటోలో ఎక్కించుకొని ఏటీఎంకు తీసుకెళ్తాడు. ఈ క్రమంలో అతని మాటలకు ఫిదా అయిన టూరిస్టు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 12 మిలియన్లకు పైగా వ్యూస్, 6 లక్షల లైక్స్ తో ట్రేండింగ్ లో ఉంది. ‘కేరళలో ఆటో డ్రైవర్లు కూడా ఇంగ్లిష్ లో మాట్లాడతారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఎస్బీఐ పనిచేయడం లేదని మరొకరు వ్యాఖ్యానించారు. “అతని మాటతీరు బ్రెజిలియన్ ఆంగ్లాన్ని పోలి ఉంటుంది” అని మరొక వ్యక్తి చెప్పాడు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..