Jr.NTR-Kodali Nani: అప్పట్లో కొడాలి నాని.. ఎన్టీఆర్ ఎంత క్లోజ్‌గా ఉండేవారో చూశారా ?.. ఓల్డ్ ఫోటో వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ త్రోబ్యాక్ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ పిక్ చూసి అభిమానులు, నెటిజన్స్ హ్యాప్పీగా ఫీల్ అవుతున్నారు.

Jr.NTR-Kodali Nani: అప్పట్లో కొడాలి నాని.. ఎన్టీఆర్ ఎంత క్లోజ్‌గా ఉండేవారో చూశారా ?.. ఓల్డ్ ఫోటో వైరల్..
Ntr Kodali Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2022 | 4:39 PM

వైసీపీ నాయకులు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి.. యంగ్ టైగర్‏ ఎన్టీఆర్‏కు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిన విషయమే. తారక్ తండ్రి హరికృష్ణ అంటే కొడాలి నానికి అమితమైన అభిమానం. ఆయన టీడీపీ పార్టీ నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆసమయంలోనే తారక్‏కు నానికి మధ్య స్నేహం కుదిరింది. ఎన్టీఆర్ కొడాలి నానితో.. వల్లభనేని వంశీతో సన్నిహితంగా ఉండేవారు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ సినిమా సెట్‏లో నాని, వంశీ సందడి చేసేవారు. వీరిద్దరు కలిసి తారక్ చిత్రాలను కూడా నిర్మించారు. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. ఇటీవల తారక్, అమిత్ షా సమావేశంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఎలాంటి ఉపయోగం లేకపోతే మోదీ, అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవర్ని కలవరని అన్నారు నాని.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ త్రోబ్యాక్ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ పిక్ చూసి అభిమానులు, నెటిజన్స్ హ్యాప్పీగా ఫీల్ అవుతున్నారు. లైక్స్, షేర్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే అది మరే ఫోటో కాదు. తారక్, కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసున్న ఫోటో. అందులో కొడాలి నాని మధ్యలో కూర్చుని సీరియస్‏గా పుస్తకంలో ఏదో చూస్తుండగా.. ఎన్టీఆర్ నవ్వుతూ నాని కాలిపై కాలు వేసి కూర్చున్నారు. అలాగే మరోవైపు వల్లభనేని వంశీ సైతం నవ్వుతూ కూర్చున్నారు. ఈత్రోబ్యాక్ ఫోటోను ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ పనిచేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.