AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కంటిలో కోట్ల విలువైన వజ్రం పొదిగిన వ్యక్తి.. షాకింగ్‌ వీడియో వైరల్‌

మీరు దంతాలలో బంగారం, వెండి ప్లేట్లు ఉన్న వ్యక్తులను చూసి ఉంటారు. కానీ, ఎవరైనా కళ్ళలో వజ్రాలు పొదిగి ఉండటం మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? అదేలా సాధ్యం అనుకుని షాక్‌ అవుతున్నారు కదా..? ఇది ఊహించలేనిదిగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. ఈ సంఘటన గురించిన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్‌ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి కంటిలో వజ్రం పొదిగి ఉంటుంది. కంటిలో వజ్రం లాంటి కాంతితో తిరుగుతున్న ఈ వ్యక్తి గురించి పూర్తి డిటెల్స్‌ ఇక్కడ తెలుసుకుందాం.

Watch: కంటిలో కోట్ల విలువైన వజ్రం పొదిగిన వ్యక్తి.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Diamond Eye
Jyothi Gadda
|

Updated on: Oct 23, 2025 | 7:13 PM

Share

ఒక వ్యక్తి కంటిలో వజ్రం పొదిగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో ఆ వ్యక్తి తన వజ్రం పొదిగిన కన్నును కెమెరాకు చూపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @_jonesjewelryco_ ఖాతా ద్వారా షేర్ చేశారు. కంటిలో వజ్రం పొదిగిన ఈ వ్యక్తి వీడియోపై అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు రాశాయి. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్లేటర్ జోన్స్. ఆ వ్యక్తి అమెరికాలోని అలబామా నివాసి. అతని కృత్రిమ కళ్ళలో రెండు క్యారెట్ల వజ్రం పొదిగి ఉంది. దీని విలువ దాదాపు 2 మిలియన్ డాలర్లు (సుమారు 1.45 మిలియన్ పౌండ్లు) ఉంటుందని చెబుతారు. నేటి భారత రూపాయిలలో మాట్లాడితే, దాని ధర దాదాపు 16 కోట్ల 95 లక్షల రూపాయలు ఉంటుంది. స్లేటర్ ఈ ప్రత్యేకమైన కన్ను చూసిన తర్వాత, ప్రజలు అతన్ని జేమ్స్ బాండ్ సినిమాలోని విలన్‌తో పోలుస్తున్నారు.

దీని వెనుక అసలు కారణం ఏంటంటే..

ఇవి కూడా చదవండి

స్లేటర్ కు 17 ఏళ్ల వయసులో టాక్సోప్లాస్మోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల అతని కుడి కన్ను దెబ్బతింది. మొదట్లో, అతని దృష్టి క్రమంగా క్షీణించి, చివరికి చూపు కోల్పోయాడు. అతను చాలా రకాల సర్జరీలు చేయించుకున్నాడు. కానీ, అతని కన్ను నయం కాలేదు. చివరికి దానిని తొలగించాల్సి వచ్చింది. కుడి కన్ను కోల్పోయిన తర్వాత, స్లేటర్ ఈ నష్టాన్ని సానుకూలంగా మార్చుకున్నాడు. ఇది అతనికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది.

డైమండ్ ఐ తయారు చేసిన నిపుణుడు ఏం చెప్పాడంటే..

స్లేటర్ ఒక నగల డిజైనర్, తన వృత్తిని దృష్టిలో ఉంచుకుని తన కృత్రిమ కన్నును ప్రత్యేకంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం, అతను కృత్రిమ కన్ను నిపుణుడు జాన్ ఇమ్‌తో కలిసి కాంతిలో మెరిసే వజ్రాల కనుపాపతో కూడిన కన్నును రూపొందించాడు. జాన్ ఇమ్ తన 32 సంవత్సరాల కెరీర్‌లో సుమారు 10,000 కృత్రిమ కళ్లను తయారు చేశానని చెప్పాడు. కానీ, ఈ కన్ను తాను ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత ఖరీదైనదని అన్నారు. రెండు క్యారెట్ల వజ్రం వెనుక గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. పెద్ద వజ్రం కంటికి సరిపోదు కాబట్టి, రెండు క్యారెట్ల వజ్రాన్ని ఎంచుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు స్లేటర్ తనను తాను “డైమండ్ ఐ” అని పిలుచుకుంటాడు. ఈ ప్రత్యేకమైన అనుబంధాన్ని తన ఆభరణాల వ్యాపారంలో భాగంగా చేసుకుంటున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..