Watch Video: ఇలాంటి హోలీని ఏ ప్రేమికుడు వొద్దంటాడు భయ్యా.. వైరల్ అవుతున్న ప్రేమికుల వీడియో..

ఈ మధ్య కాలంలో ప్రేమికులు పబ్లిక్ ప్లేసుల్లోనే రెచ్చిపోతున్నారు. నాలుగు గోడల మధ్య చేసే కార్యకలాపాలను జనబాహుళ్యంలో చేసేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో చాలామంది ప్రేమికులు..

Watch Video: ఇలాంటి హోలీని ఏ ప్రేమికుడు వొద్దంటాడు భయ్యా.. వైరల్ అవుతున్న ప్రేమికుల వీడియో..
Lovers
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2023 | 3:38 PM

ఈ మధ్య కాలంలో ప్రేమికులు పబ్లిక్ ప్లేసుల్లోనే రెచ్చిపోతున్నారు. నాలుగు గోడల మధ్య చేసే కార్యకలాపాలను జనబాహుళ్యంలో చేసేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో చాలామంది ప్రేమికులు.. బైక్‌పై చిత్రవిచిత్రంగా కూర్చుంటూ రకరకాల ఫీట్స్ చేస్తున్నారు. ప్రేయసి ముందు కూర్చోబెట్టుకుని బైక్ నడుపుతూ రోడ్డుపై రయ్‌మంటూ దూసుకుపోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది ప్రేమికులకు. ఇప్పటికే ఇలాంటి ఘటన చాలా వెలుగు చూడగా.. తాజాగా అలాంటిదే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హోలీ వేళ పూర్తి రంగులమయం అయిన ఇద్దరు ప్రేమికులు.. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఈ జంట బైక్‌పైనే రొమాన్స్ చేస్తూ చెక్కర్లు కొట్టడం చూసిన జనాలు అవాక్కయ్యారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ప్రియుడు నడుపుతుండగా.. అతనికి ఎదురుగా, అంటే బైక్ పెట్రోల్ ట్యాంక్‌‌పై అమ్మాయి అతన్ని హత్తుకుని కూర్చుంది. అతని బిగ్గరగా హత్తుకుని, ముద్దులు పెడుతోంది. అయితే, ఈ సీన్‌ను ఆ బైక్ వెనకాలే వెళ్తున్న ఓకారులోని ప్రయాణికులు ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. అది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు లవర్స్‌కి సపోర్ట్ ఇస్తుంటే.. మరికొందరు పబ్లిక్‌గా ఇదేంపాడు పని అంటూ విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక గతనెల ఫిబ్రవరిలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అజ్మీర్ నగరంలో ఒక జంట మోటార్ బైక్‌పై కిస్సింగ్ స్టంట్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..