ఈ గుండు బాస్ ఎవరో.. “ఇస్మార్ట్ శంకర్” కాదు కదా..!

ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ కొట్టిన హీరో రామ్ పోతినేని.. తాజాగా సోషల్ మీడియాలో వైల్డ్ లుక్ ఎంట్రీతో అదరగొట్టాడు. రామ్ నయా లుక్ చూసిన అభిమానులు నెట్టింట్లోనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ భిన్నమైన షర్ట్, ఫ్రెంచ్ గడ్డంలో గుండు చేయించుకుని కనిపిస్తున్న రామ్ పూర్తిగా డిఫరెంట్ లుక్ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ విడుదల తర్వాత రామ్ కుటుంబంతో కలిసి విదేశీ టూర్ కి వెళ్లాడు. టూర్ ముగించుకుని వచ్చిన రామ్  అప్పటి నుండి […]

ఈ గుండు బాస్ ఎవరో.. ఇస్మార్ట్ శంకర్ కాదు కదా..!
Follow us
Anil kumar poka

| Edited By:

Updated on: Aug 10, 2019 | 2:21 PM

ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ కొట్టిన హీరో రామ్ పోతినేని.. తాజాగా సోషల్ మీడియాలో వైల్డ్ లుక్ ఎంట్రీతో అదరగొట్టాడు. రామ్ నయా లుక్ చూసిన అభిమానులు నెట్టింట్లోనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ భిన్నమైన షర్ట్, ఫ్రెంచ్ గడ్డంలో గుండు చేయించుకుని కనిపిస్తున్న రామ్ పూర్తిగా డిఫరెంట్ లుక్ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ విడుదల తర్వాత రామ్ కుటుంబంతో కలిసి విదేశీ టూర్ కి వెళ్లాడు. టూర్ ముగించుకుని వచ్చిన రామ్  అప్పటి నుండి ఏక్కడ చూసినా..క్యాప్ పెట్టుకునే కనిపించారు. అయితే, తలకు టోపీ ఉండటంతో గుండు సంగతి ఎవరూ గమనించలేకపోయారు. కానీ, ఆ టోపీ వెనుక అసలు కారణంగా ఇలా బయటపెట్టాడు రామ్. అయితే, రామ్ నయా లుక్ వెనక అసలు కారణం మరేదైనా ఉందా అన్న అనుమానం మాత్రం అటు నెటిజన్లను, ఇటు అభిమానులను వెంటాడుతోంది.