పిల్ల ఎలుగు డ్యాన్స్.. మజా..మజా.. చూడాల్సిందే !
రుమేనియా వెళ్తే అక్కడి ఓ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో తిరుగాడే ఎలుగుబంట్లు, ఇతర జంతువులను చూడడానికి విజిటర్లు పోటెత్తుతుంటారు. మరీ ముఖ్యంగా వాటికి పుట్టిన పిల్లలు మనుషులంటే ఏ మాత్రం భయంలేకుండా సమీపం వరకు వచ్ఛేస్తాయి.. ఇప్పుడు మనం చూడబోయే ఓ సరదా సీన్ కూడా నవ్వు తెప్పించక మానదు.. సుమారు రెండున్నర ఏళ్ళ గోధుమరంగు ఎలుగు.. ఓ పెద్ద రాయివద్దకు వెళ్లి.. దురద పుడుతున్న తన వెన్నును ఆ రాయికి రుద్దుకున్న వైనం చూడాల్సిందే.. మొదట […]
రుమేనియా వెళ్తే అక్కడి ఓ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో తిరుగాడే ఎలుగుబంట్లు, ఇతర జంతువులను చూడడానికి విజిటర్లు పోటెత్తుతుంటారు. మరీ ముఖ్యంగా వాటికి పుట్టిన పిల్లలు మనుషులంటే ఏ మాత్రం భయంలేకుండా సమీపం వరకు వచ్ఛేస్తాయి.. ఇప్పుడు మనం చూడబోయే ఓ సరదా సీన్ కూడా నవ్వు తెప్పించక మానదు.. సుమారు రెండున్నర ఏళ్ళ గోధుమరంగు ఎలుగు.. ఓ పెద్ద రాయివద్దకు వెళ్లి.. దురద పుడుతున్న తన వెన్నును ఆ రాయికి రుద్దుకున్న వైనం చూడాల్సిందే.. మొదట తన రెండు కాళ్ళూ పైకెత్తి.. అచ్ఛు ఓ చిన్నారి డ్యాన్స్ చేస్తున్నట్టే పైకీ..కిందకీ ఆడించడం.. ఓ ఫోటోగ్రాఫర్ చూశాడు. మరో టూరిస్టు కూడా ఆ ‘ అద్భుత ‘ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. వాహ్.. ఈ డ్యాన్స్ కాని డ్యాన్స్ చూసి ఎంజాయ్ చెయ్యనివాళ్ళు లేరు.. మనమూ చూసేద్దాం మరి !