హీరోగార్ని పడేసి పకపకా నవ్వింది.. ఎవరా చిన్నది ?
తమ సినిమా ప్రమోషన్లలో యాక్టర్లు బిజీగా ఉండడమే కాదు… ఒక్కోసారి విచిత్రమైన పాట్లూ పడుతుంటారు. అందులో ఓ భాగమే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ సోనాక్షి సిన్హాల రియల్ సరదా సన్నివేశం ! తమ తాజా సినిమా ‘ మిషన్ మంగళ్ ‘ ప్రమోషన్ విషయానికే వస్తే.. వీళ్ళిద్దరూ తోటి యాక్టర్లు తాప్సి పన్ను, విద్యా బాలన్, నిత్యా మీనన్ లతో కలిసి ముచ్చటలాడుకుంటున్న వేళ.. అక్షయ్ తన కుర్చీలో కాస్త వెనక్కి వాలుదామనుకునేంతలో.. తన […]
తమ సినిమా ప్రమోషన్లలో యాక్టర్లు బిజీగా ఉండడమే కాదు… ఒక్కోసారి విచిత్రమైన పాట్లూ పడుతుంటారు. అందులో ఓ భాగమే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ సోనాక్షి సిన్హాల రియల్ సరదా సన్నివేశం ! తమ తాజా సినిమా ‘ మిషన్ మంగళ్ ‘ ప్రమోషన్ విషయానికే వస్తే.. వీళ్ళిద్దరూ తోటి యాక్టర్లు తాప్సి పన్ను, విద్యా బాలన్, నిత్యా మీనన్ లతో కలిసి ముచ్చటలాడుకుంటున్న వేళ.. అక్షయ్ తన కుర్చీలో కాస్త వెనక్కి వాలుదామనుకునేంతలో.. తన వాలుకనులతో అది గమనించిన సోనాక్షి చిలిపిగా అతని ఛాతీమీద ఎడమచేతిని వేసి వెనక్కి నెట్టేసింది. అంతే.. అంతోటి హీరోగారు కూడా వెనక్కు పడిపోయాడు. ఈ సీన్ చూసి సోనాక్షి మొదట ముసిముసి నవ్వులతో సరిపెట్టింది. తాప్సి, నిత్యా మీనన్, విద్యాబాలన్ కాస్త కంగారు పడ్డారు కూడా.. అయినా సోనాక్షి తన నవ్వును ఆపుకోలేక పకపకా నవ్వేసింది. కిందపడిన అక్షయ్… సోనాక్షి చర్యను లైట్ గా తీసుకుంటూ తానూ ముసిముసినవ్వులు నవ్వాననిపించాడు. తాప్సి మాత్రం.. ‘ ఏంటమ్మా ఇది ‘ ? అంటూ సోనాక్షిని సున్నితంగా మందలించినంత పని చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది మరి ! అన్నట్టు ‘ మిషన్ మంగళ్ ‘ మూవీ ఈ నెల 15 న రిలీజవుతోంది.