Saaho Trailer: గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడే..

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ముంబైలో అనూహ్యంగా అతి పెద్ద రీతిలో రెండు వేల […]

Saaho Trailer: గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడే..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 12, 2019 | 2:18 PM

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. ముంబైలో అనూహ్యంగా అతి పెద్ద రీతిలో రెండు వేల కోట్ల రాబరీ జరుగుతుంది. అది ఎవరు చేశారు.? ఎలా చేశారనేది పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నగా మారుతుంది. దీనితో ఈ కేసును డీల్ చేయడానికి ఓ అండర్ కవర్ కాప్‌ (ప్రభాస్)ను నియమిస్తారు. ఈ క్రమంలో మాఫియా డాన్(నీల్ నితిన్) వార్జె సిటీలోని లక్షల కోట్లు విలువ చేసే రహస్యాలు ఉన్న బ్లాక్ బాక్స్ తెచ్చే టాస్క్‌ని డార్లింగ్‌కే అప్పగిస్తాడు. అది తీసుకొచ్చే క్రమంలో ప్రభాస్.. క్రైమ్ డిపార్ట్మెంట్‌కు చెందిన అమృత నాయర్(శ్రద్ధా కపూర్)తో ప్రేమలో పడతాడు. అప్పటికే ఎందరో కరుడు కట్టిన మాఫియా గ్యాంగ్‌స్టర్ల కన్ను ఆ బాక్స్ మీద పడుతుంది. వీళ్ళ నుంచి ఆ బాక్స్‌ను ప్రభాస్ ఎలా దక్కించుకున్నాడు.? ముంబై రాబరీ చేసిన నిందితులు ఎవరు.? అసలు ఆ చోరీకి.. బాక్స్‌కు ఉన్న సంబంధం ఏమిటి.? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూడాల్సిందే.

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ ట్రైలర్ బిగ్ డిన్నర్‌లా ఉంది. మచో లుక్స్‌లో ప్రభాస్ మతిపోగ్గోటే విధంగా ఉన్నాడు. యాక్షన్ సన్నివేశాలకు కాస్తా రొమాంటిక్ టచ్‌తో సాహో ట్రైలర్ అదిరిపోయింది. భీకరమైన గ్యాంగ్‌స్టర్స్ మధ్య ప్రభాస్ యాక్షన్ సింప్లీ అదుర్స్ అనిపించేలా ఉంది. శ్రద్దా కపూర్ అటు గ్లామర్‌తోనూ.. ఇటు నటనతో కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు..అనే డైలాగు ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ అంటూ ఉంటుంది. మురళి శర్మ- మహేష్ మంజ్రేకర్ – నీల్ నితీష్ – అరుణ్ విజయ్ అందరికి ఒక్కో షాట్ లో చూపించేసి వైలెన్స్ ఏ స్థాయిలో ఉండబోతోందో శాంపుల్ చూపించారు. మొత్తానికి ఆగష్టు 30న బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే రేంజ్‌లో సాహో సినిమా సిద్ధమైందని చెప్పవచ్చు.