మహేష్ ఇండియన్ ఆర్మీని కించపరిచాడా..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. శుక్రవారం మహేష్ పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు ది ఇంట్రో పేరుతో మూవీలో అతడి లుక్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. అందులో ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ లుక్‌ను అతడి అభిమానులను తెగ ఆకట్టుకుంది. అయితే ఈ లుక్‌‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘అల్లు అర్జున్ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ అనే […]

మహేష్ ఇండియన్ ఆర్మీని కించపరిచాడా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 10, 2019 | 3:49 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. శుక్రవారం మహేష్ పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు ది ఇంట్రో పేరుతో మూవీలో అతడి లుక్‌ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. అందులో ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ లుక్‌ను అతడి అభిమానులను తెగ ఆకట్టుకుంది. అయితే ఈ లుక్‌‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.

వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘అల్లు అర్జున్ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ అనే చిత్రంలో నటించగా.. అందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఇక ఆ పాత్ర కోసం బన్నీ చాలా మేకోవర్ అయ్యాడు. ముఖ్యంగా తన బాడీ షేప్ నుంచి హెయిర్‌ స్టైయిల్ వరకు ఆర్మీ అధికారుల్లాగానే మార్చుకున్నాడు బన్నీ. ఇక తాజాగా వచ్చిన మహేష్ లుక్‌లో అలాంటి మేకోవర్లు ఏవీ లేవని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మేరకు మహేష్, బన్నీ ఫొటోలను పక్కనపెడుతూ.. ఆర్మీ హెయిర్‌కట్, ప్రాపర్ షేవ్, బాడీ పిట్‌నెస్ తేడాలను చూపించాడు. దానికి ఇండియన్ ఆర్మీని మహేష్ కించపరిచాడంటూ అతడు కామెంట్ పెట్టాడు. దీనిని బన్నీ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తున్నారు.

కాగా మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం రెండూ వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఇప్పుడే ఇలా ఉంది అంటే విడుదలయ్యే సమయానికి ఈ ఇద్దరి అభిమానుల మధ్య ఇంకెన్ని గొడవలు వస్తాయో చూడాలి.