AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ కాలి రెండో బొటనవేలు పెద్దదా.? వ్యక్తిత్వం ఇదే

ఎదుటవారితో మనం మాట్లాడే తీరు.. మెలిగే విధానం మాత్రమే కాదు.. మన చేతి వేళ్లు, కాలి వేళ్ల ఆకృతి, కాలి ఆకారంతో కూడా మన వ్యక్తిత్వం.. అలాగే మనలో దాగున్న బలమైన వ్యక్తిత్వ లక్షణాలు..

Personality Test: మీ కాలి రెండో బొటనవేలు పెద్దదా.? వ్యక్తిత్వం ఇదే
Trending
Ravi Kiran
|

Updated on: Oct 15, 2024 | 1:58 PM

Share

ఎదుటవారితో మనం మాట్లాడే తీరు.. మెలిగే విధానం మాత్రమే కాదు.. మన చేతి వేళ్లు, కాలి వేళ్ల ఆకృతి, కాలి ఆకారంతో కూడా మన వ్యక్తిత్వం.. అలాగే మనలో దాగున్న బలమైన వ్యక్తిత్వ లక్షణాలు కూడా బయట పెట్టేయొచ్చుట. పలు అధ్యయనాలు, పరిశోధనలు ఈ విషయాలను స్పష్టం చేశాయి. మరి అదేంటో చూసేద్దామా..

ఇది చదవండి: గడ్డి మేస్తోన్న లేగ దూడ అదృశ్యం.. కొండచిలువపై అనుమానంతో పట్టి.. కక్కించగా

మీ కాలి వేళ్లు అన్ని కూడా ఒకే పరిణామంలో ఉంటే.. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారని అర్ధం. సమయాన్ని, వనరులను సరిగ్గా ఉపయోగించి మీ పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. మీరు మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటూ, సొంత లేదా ఇతరులకు ఇచ్చిన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేస్తారు. మీరు చాలా తెలివిగా ఉంటారు. అలాగే అందరితోనూ కలివిడిగా సాగిపోతారు. ఈ లక్షణాలే మీ రిలేషన్స్ పెరగడానికి దోహదపడతాయి.

ఇవి కూడా చదవండి

మీ మొదట, రెండు, మూడో కాలి వేళ్లు ఒకే ఎత్తులో ఉంటే, మీరు స్నేహపూర్వక, దయగల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అవుట్‌గోయింగ్, సోషలైజ్డ్ వ్యక్తి అని అర్థం. మీరు కనెక్షన్స్ పెంచుకోవడంలో సిద్దహస్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీరు చెప్పే, చేసే విషయాలలో ఎప్పుడూ నమ్మకంగా, దృఢంగా ఉంటారు.

ఇది చదవండి: ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గోడకు కొట్టిన బంతిలా

మీ కాలి మొదటి వేలు పొడవుగా ఉండి.. మిగతా నాలుగు వేళ్లు 45 డిగ్రీల కోణంలో ఉన్నట్లయితే.. మీరు ఎప్పుడూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని అర్ధం. కొంచెం మొండితనం.. అలాగే సృజనాత్మకత కలిగి ఉంటారు. మీరు ఇతరులను ఈజీగా ఒప్పించగలరు. ఇతరుల సీక్రెట్స్‌ను దాచిపెడతారు. అలాగే మీరు నమ్మదగిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు.

మీ కాలి రెండో బొటనవేలు పెద్దదిగా ఉన్నట్లయితే, మీరు గ్రీకు పాదాల ఆకృతిని కలిగి ఉంటారట ఇలాంటి వారు నేచరుల్‌గా, ఉద్వేగభరితంగా, సృజనాత్మకతతో వ్యవహరిస్తారట. ప్రతీ పనిలోనూ అడ్వెంచర్ కోరుకుంటారు. మిమ్మల్ని మీరు ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారట. అలాగే కొత్త సవాళ్లను ఎల్లప్పుడూ ఎదుర్కుని.. విజయాలు సాధిస్తారట.(Source)

ఇది చదవండి: సముద్రపుటొడ్డున వింత ఆకారం.. ద్రవంలా ఉందని పట్టుకుంటే గుండె గుభేల్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..